పుట:Andhra bhasha charitramu part 1.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముడ్); సాపదు (బం. శాపడ్); అంచించు (బం.ఆచ్); కూఱు=దట్టించు (బం. కూఱ్); జోకు (బం. ఝూక్); బుడుగు, ముడుగు, (బం. డుబ్, బుఱ్); తుఱుము=చిన్నముక్కలుగ ఖండించు (బం. థుత్, థుర్, సం. ధుర్వ్=చంపు); పాటించు (బం. పట్); పింజించు, పొంజు (జం. పీజ్); పురపుర బొక్కు (బం. పుత్, సం. పుట్); పాతు (బం. పుఱ్, పూఱ్); మొద.

పాణినీయ ధాతుకోశమునుండి యీ క్రింది వుద్ధృతములు: అగు(*అగ్); అంచు(*అచ్, అఞ్చ్); ఆడు (*అట్); అడగించు (అడ్); అడ్డగించు (*అట్ట్, అడ్డ్); అను (*అణ్, అన్); అణచు (*అణ్); అత్తు (*అత్); అదుము (*అద్); అంజు (*అఞ్జ్); అమయు (*అమ్);ఆచు (*ఆఛ్); ఎగురు, ఎగయు (*ఇఖ్,* ఇగ్, ఈఖ్, ఈహ్); ఏలు (*ఇల్); ఇయ్యకొను (*ఇష్); ఏగు, ఈగు, వీగు, ఇగ్గు (*ఈ,ఋ); ఈదు (*ఈజ్); ఈదాడు (*ఈడ్); (ఏయు *ఈష్); ఉరుకు (*ఉఖ్); కన్నడ్ము: తుంబు (*ఉంభ్); కన్నడము: కత్తు (*కత్థ్); కమియు (*క్లమ్); కలియు, కలుపు (*కల్); (ఎండ) కాయు (*కాశ్); కుక్కు, క్రుక్కు (*కుక్); కూయు (* కుజ్, కూజ్, తూజ్); కుట్టు, కొట్టు (*కుట్ట్); కుడుచు (*కుడ్); కుసుకు (*కుస్); చేయు, కొను (*కృ); క్రుయ్యు (*కృశ్); కొఱుకు (*కౄ); క్రుంగు (*కుఞ్చ్); క్రుఞ్చ్); క్రుయ్యు, కెలయు (*క్లిశ్); చిక్కు (*క్షి); చా (చచ్చు) (*క్షై); కట్టు (*ఖట్); (కొబ్బరి) కోఱు, గొఱుగు (*ఖుర్, క్షుర్); చీఱు, చీలు, చిఱుగు, చినుగు (*చిర్); చుట్టు (*చుట్); (పొగ) చూరు, చూడు (*చూర్); చేయు (*చేష్ట్); చంపు (*జ్ఞప్); త్రచ్చు (*తక్ష్) త్రుంచు (*తృంభ్); తిను (*తృణ్); త్రుళ్లు, త్రెళ్లు (* త్రుట్); నడచు (*నట్, నృత్); పడు (*పట్, పడ్, పత్, వృత్); పంచు (*పచ్); (పెట్టి) పోయు (*పుష్); పూచు (*పుష్ప్); పొరయు (* ప్రుష్ల్); పొవయు (*ప్లుష్); బుక్కు (*బుక్క్); తమిళము:- పేసు (*భాష్); పూయు (*భూష్); బుడుగు, బ్రుంగు, మునుగు (*భృడ్), మీటు (*మిట్); మూయు (*ముచ్); మోయు, మోచు (*ముష్); ముడియు, చూ. మూట, ముడి (*మూజ్); మేయు (*మేవ్, మ్లేవ్); మాయు (*మ్లై); వంగు (*వల్, వంచ్); వంచు (*వంచ్); వలగొను (*వల్); వ్రయ్యు, వ్రచ్చు (* వ్రష్, వ్రశ్చ్, వ్రద్); వేడు (*విడ్, వేడ్); వెదకు (*విద్) ; వెలయు (*విల్); వీచు (*వీ, వీజ్); చాటు (*శాడ్); చెప్పు (*శీభ్); సుడియు (*శుచ్);