పుట:Andhra bhasha charitramu part 1.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వానిని పండితులు వ్యాకరించియుండలేదు. అట్టివానిలో ద్రావిడభాషావర్గ మొకటి. ఈ విషయము మఱియొకచోట నీ గ్రంధమున వివరింపబడియున్నది.

ధాతుజ విశేషణములనుండియు, విశేష్యములనుండియు గలిగిన క్రియారూపములు మఱియొకచోట చూపబడియున్నవి. వీనిలో జాలమట్టుకు బ్రాచీనములే. ఆధునికకాలమున దద్భవధాతువు లేర్పడుట యంతగా లేదు.

II. 2. (ఆ) తత్సమములు: ఇట్టిధాతువులు కొన్ని తెనుగు వాఙ్మయమున జేరినవి. కరుణించు, దృష్టించు మొదలయినవిట్టి వాని కుదాహరణములు.

II. 2. (ఇ) అన్యదేశజములలో హిందూస్థానీభాషనుండివచ్చిన వెక్కువగా నున్నవి. ఇట్టివానిలో రెండవవర్ణము సాధారణముగ దీర్ఘముగ నుండును. వీని యంతములందు - 'ఆయించు' - అను ప్రత్యయము చేరుచుండును.

అటకాయించు,అదమాయించు, ఉజ్జాయించు, కే (ఖే)టాయించు, గదమాయించు, గమాయించు, గుమాయించు, జమాయించు, జుమాయించు, చునాయించు, టలాయించు, రలాయించు తటాయించు, తమాయించు: తుటాయించు, తుటారించు, దబకాయించు, దబాయించు, దమాయించు, నిభాయించు, పచారించు, పస్తాయించు, పుసలాయించు, పురాయించు, ఫర్మాయించు, బలకాయించు, బడాయించు, బిడాయించు, రంగాయించు, పాలాయించు, సతాయించు, సముదాయించు, సాసాయించు, మొద.

సాధారణముగ దెనుగుశబ్దములలో మొదటివర్ణముమీదనే ఊత ఉండును. కావున రెండవ మూడవవర్ణములు సాధారణముగ దీర్ఘములుగ నుండవు. అవి మూలభాషలో దీర్ఘముగనున్నను తెనుగున హ్రస్వములగుటయు, రానురాను లోపించుటయు సంబవించును. ఈ విషయము తెనుగునందలి యూతనుగూర్చి చెప్పునప్పుడు ముచ్చటింపబదినది. హిందూస్థానీ మొదలగు భాషలనుండి తెనుగునజేరిన శబ్దములందలి పదమధ్యదీర్ఘములు మాత్ర మట్లే నిలిచియున్నవి. కావున నివి చాల నవీనముగ దెనుగున జేరినవని చెప్పవచ్చును.

అయినను, పదమధ్యదీర్ఘములుగల కొన్నిదేశ్యక్రియలును దెనుగున లేకపోలేదు. దువాళించు = గుఱ్ఱమును బరుగెత్తజేయు, నివాళించు= ఆరతెత్తు; పిసాళించు=ప్రకాశించు, పరిమళించు, వ్యాపించుమొద. మురాళించు= నురాళించు=దిగదుడుచు; సుమాళించు= ఎక్కువసంతోషమునొందు మొద. ఇట్టివియు నన్యదేశ్యములేయై యుండును. వీనిసంపర్కముచే గేవల తద్భవధాతువులును బదమధ్యదీర్ఘము నొందవచ్చును. ఉదా. కళా