పుట:Andhra bhasha charitramu part 1.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బం. బాట్; సం. వంట్; తె. పట్టు; బం.బట్; సం.వృత్; తె. బొల్లి(మాట) (ధాతువు?), బం. బోల్; సం. బ్రూ; తె. వంచు; బం. భాజ్; సం. భంజ్; తె. సొగయు; బం. సోహ్, సం. శుభ్; -మొ

I. 1. (ii) ప్రాచీనార్యభాషయందలి యుపసర్గ సహిత ధాతువులు: తె. ఉట్టు; బం. ఉఠ్; సం. ఉద్-స్థా; తె. నెవ (గ) డు; బం. నిబా (హ్), సం. నిర్వహ్ మొ.

1. 2. ప్రాచీనార్యభాషాధాతువుల కితరచిహ్నములు చేరినవి: తె. కొను; బం. కిన్; సం. కృణు; తె. దును; బం. ధునే; సం. ధును మొ;

1. 3. సంస్కృతమునుండి చేరిన తత్సమములు: ఎట్టి సంస్కృతధాతు వయినను తెనుగు ప్రత్యయములతో దెనుగున జేరవచ్చును. సంస్కృతము నుండి చేరిన యర్థతత్సమములు: సంతసించు, బుజ్జగించు, ఆరడించు, తగు, తిను మొ.

1. 4. వ్యుత్పత్తి సందేహముగలధాతువులు: వీనినే దేశ్యములని పిలువ వలసియుండును. ఇట్టి వతిప్రాచీనతద్బవములని యాధునికార్యభాషా తత్త్వజ్ఞుల యభిప్రాయము. వీని తద్భవత్వము నిరూపించుటకు వారుప్రయత్నించుచున్నారు. ఇట్టి దేశ్యధాతువులు నేటి యార్యభాషలయందున్న వానికంటె దెనుగున నెక్కువగ లేవు.

II .థాతుజథాతువులు.

II. 1. ప్రేరణార్థక చిహ్నముతో గలసి వికారము నొందినవి: తె. ఓకిలించు; బం.ఉగార; సం. అవక్రియతే, తె. దాచు, బం. దా; తె. నప్పు; సంజ్ఞాప్యతే; ప్రా. ణప్పేఇ; హిం. నాపే; సం దాపయ; తె. మాపు; బం. మా; సం. మ్లాపయ; తె. పడయు; బం. పాఱా,య్; సం. పాతయ; తె. గాలించు. బం గాలే; సం. గాలయతి; తె. చెలయు; బం. చాలే, సం. చాల యతి; తె. నోయు; బం. నోయ్; సం. నామయతి మొద.

II. 2. కృత్తద్ధిత జన్యధాతువులు: (అ) తద్భవములు (1) ప్రాచీనములు.

ఈ వర్గపు ధాతువులు విశేష్యములనుండియు, ధాతుజ విశేషణముల నుండియు గలిగినవి. ఇండో-ఆర్యభాషయందే విశేష్య, ధాతుజ విశేషణముల నుండి క్రియారూపము గల్పింపబడుచుండెను. వానికిట్టి సందర్భముల జేరు- ఆయ-(కృష్ణాయతే మొద). ప్రత్యయము చేరకయే యవి క్రియారూపముల నొందుచుండెను. సంస్కృత వైయాకరణుల ప్రకార మెట్టి విశేష్యప్రాతిపదికమైనను గ్రియాప్రాతిపదికముగ నుపయోగింపవచ్చును. ప్రత్యయసంయోజనము