పుట:Andhra bhasha charitramu part 1.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తెనుగులోని ధాతువుల నీ క్రింది విధముగ వర్గములుగ నేర్పఱుపవచ్చును.

I. ప్రధానధాతువులు.

1. ప్రధానధాతువులు - (i) కేవలధాతువులు. (ప్రాచీనార్యభాషలలోనినివి.) (ii)ఉపసర్గసహితధాతువులు: ప్రాచీనార్యభాషలలోనిధాతువుల కాయా వికరణచిహ్నములును, నితరచిహ్నములును జేర్చుటవలన నేర్పడినవి.

3. సంస్కృతమునుండి చేరినధాతువులు (తత్సమములు, అర్థతత్సమములు).

4. వ్యుత్పత్తి సందేహముగల ధాతువులు

(దేశ్యములుP). 1. ప్రేరణార్థకధాతువులు. (అ) (i) ప్రాచీనములు -తద్భవములు (ii) మధ్య, ఆధునిక కాలికములు.

(I) 1. ధాతుజధాతువులు .

2. కృత్తద్ధితజన్య|(ఆ) తత్సమములు.

ధాతువులు| (ఇ) అన్యదేశ్యములు

3. సమస్తములు, ప్రత్యయసహితములు.

4. ధ్వన్యనుకరణములు.

5. సందేహాస్పదములు.

ఉదాహరణములు.

1. (i). ప్రాచీనార్యభాషలలోని ప్రధానధాతువులు : కేవలధాతువులు. తె. అచ్చు: బంగాళీ. అఛ్; ప్రా. అచ్ఛతి ; ఇండోయూరోపియను* ఎస్కోతి; తె. కందు; బం. కాద్; సం. క్రంద్; తె. కఱ్(చు), కా(గా)డు; బం. కాట్; సం. కృత్; తె. గుణించు; బం. గణ్, గుణ్; సం. గణ్; తె. చీఱు(లు); బం. చీఱ్; సం. ఛిద్; తె. తాకు; బం. డాక్ (చూ.తె.డాక); ప్రా. డక్క్; తె. డులు (పు); బం;దుల్. సం. చూ. దోలా; తె. నాను, బం. నాహ్; సం. స్నా; తె. పాచు (ప్రాచిపోవు); బం. పచ్, సం. పచ్; తె.పుటుకు; బం. ఫాట్; ఫృట్; ప్రా. ఆర్య. స్ఫాట్*; స్ఫట్; తె. వంతు (ధాతువు?,)