పుట:Andhra bhasha charitramu part 1.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


క్రమ్మరిల్లు (క్రమిషిత); గిల్లు (క్షత, క్షిప్త); గూసుగిల్లు (ఖుంజిత, కుంచిత); చిప్పిల్లు (క్షిప్త); చెమ్మగిల్లు (తీమ్ కృత); చ(చె)ల్లు, తల్లడిల్లు (చాలిత); చాగిల్లు (సాధ్+కృత); చొ (జొ) బ్బిల్లు (క్షుభిత); రవణిల్లు (స్థానిత, స్థాపిత); డుల్లు, డొల్లు (శిధిలిత), తారసిల్లు (ధర్షిత), తుప్పటిల్లు (తర్పిత); తొట్రిల్లు (త్రుటిత, దుష్ట); తేలగిల్లు (ధృత+కృత, తరిత+కృత), దండసిల్లు (దండిత); దద్దరిల్లు, రద్దిర్లు (త్రస్త, త్వరిత), దురపిల్లు (*దూషాపిత); దుసికిల్లు (దుష్కృత); దూపిల్లు, దూపటిల్లు (తృషాపిత); నిట్రిల్లు (నిష్ఠిత); పిక్కటిల్లు (పృధక్కృత, నర్ధిత); చిప్పిల్లు (ఛిచాపిత); పెల్లగిల్లు (పృధక్కృత, భిద్+కృత); బండిగిల్లు (బందీ కృత) బాసగిల్లు (బలాత్కృత); బీటగిల్లు (పృధక్కృత); బెండగిల్లు (భింద్+కృత); బెగ్గిల్లు, బెగ్గడిల్లు (భర్జిత, విహ్వలిత); బొల్లు (*బ్రూత); బోరగిల్లు (చూ. హిం. బోల్తా); మందటిల్లు (మందిత); మంపిల్లు (మదాపిత); మేటిల్లు (మహిత); మోరటిల్లు (ముఖరిత); ఱంతిల్లు, రొల్లు (రటిత, రాసిత); లొగ్గడిల్లు (రుగ్ణ, రోగిత, *తుచ్ఛిత); సన్నగిల్లు (శ్లక్ష్ణీకృత); సొంపిల్లు (చూ సుందర); హెచ్చిల్లు, హెచ్చిరిల్లు (వర్ధిత, ఏష్+కృత, ఏధ్+కృత).

2. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము:ఆవటిల్లు (ఆపతిత); ఊఱడిల్లు (ఉచ్ఛ్వసిత); ఊసరిల్లు (ఉత్సరిత, ఉత్సారిత); అడిగిల్లు (అధస్కృత); ఏమఱిల్లు (విస్మృత); ఒడ్డ(త్త)గిల్లు, ఒత్తిల్లు (ఉపహిత); ఒల్లగిల్లు (ఉపహృత); ఓటిల్లు (అపహృత); ఓడిగిల్లు, ఓరగిల్లు (అపహృత); దెప్పరిల్లు (ఆపాదిత, ఆపన్న, స్థాపిత); పరిడవిల్లు (పరిష్ఠాత); పల్లటిల్లు (పర్యస్త); పాయగిల్లు (అపాస్త, భాగీకృత).

49 - ళు.

క్రియాజన్యవిశేషణము: తాళు (స్థాత, ధృత).

50 - ళ్లు.

క్రియాజన్యవిశేషణము: కు(క్రు)ళ్లు (కర్శిత); త్రెళ్లు (త్రుటిత); త్రుళ్లు (త్రుటిత, దృప్త); వెళ్లు (విధృత, విగత); సళ్లు (శ్లధిత).

51 - వు.

1. తుదిగకారము వకారముగ మాఱుట; ఉత్వముపై వగాగమము వచ్ఛుట. చూ. (గు, గు).