పుట:Andhra bhasha charitramu part 1.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. శ, ష, స, క్ష లంతమందు గల ధాతువుల కనునాసికోచ్చారణము కలుగుటవలన: ఉంచు (వస్).

11 - చు.

1.ధాతువు+ఇష్య్: అడరుచు (ధృష్); అఱచు,ఆర్చు(రస్); అలరుచు (లష్).

2. ధాతువు+య(య-వికరణచిహ్నము, కర్మణి-య): ఏచు (వృధ్);కఱచు (కర్ష్); కాచు (కాశ్); కాలుచు (క్లమ్);కుదుచు (స్కుద్); కొలుచు (కూల్).

3. ఉపసర్గము+ధాతువు+ఇష్య్: అలవఱచు (అధిపత్); ఉలుచు (ఉల్లూ); ఎలరుచు (విలస్); ఏడుచు (విలస్); ఏమఱుచు (విస్మృ); ఒలుచు(అవలూ); ఓరుచు (అపధృ).

4. ధాతువున కనునాసికోచ్చారణము కలుగుటవలన: ఉనుచు(వస్ఫ్.

5. క్రియాజన్య విశేషణము+ఇష్య్: అగలుచు (ఖాత, ఘాత); అదలు (రు)చు (దారిత); కడచు, కదలుచు (గత); కెరలుచు (కృత); గెలుచు (జిత); చిముడుచు (ఛింద, ఛిన్న); చీలుచు (ఛిత్త, ఛిన్న).

6. తద్ధితరూపము+ఇష్య్: ఇ (చి)గురుచు, ఇ(చి) గ్రుచు (శిఖర).

7. విశేషణము+ఇష్య్: డు(దు)లుచు (శిథిల).

12 - చ్చు.

1. ధాతువు+య: ఎ(హె)చ్చు (వృధ్); గి (గ్రు, గ్రొ)చ్చు (ఘృష్, కృష్); చొచ్చు (స్యూ); తెచ్చు (ధృష్, తృష్); నొచ్చు (నుద్); రెచ్చు (రిచ్); వచ్చు (వ్రజ్); విచ్చు (విచ్); వ్రచ్చు (వ్రశ్చ్)

2. ధాతువు+ఇష్య్:నచ్చు (నర్ం).

3. ఉపసర్గము+ధాతువు: ఉచ్చు (ఉత్స్యూ).

13. - జు.

ధాతువు+య:గోజు (ఘుష్); పో(ప్రో)జు (పుంజ్); రాజు (రంజ్); రోజు (రుష్).

14.-౦జు.

1. ధాతువున కనునాసికోచ్చారణము: గుంజు (కృష్)

2. ధాతువు: పొంజు (పుంజ్)

15.-జ్జు. ధాతువు+య: రజ్జు (రస్).