పుట:Andhra bhasha charitramu part 1.pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ది(డి)గు(డీ); త్రాగు (తృష్); తిరుగు (సృ);వెఱుగు (వృధ్); మ(మా)లుగు (మ్లా); అఱుగు (క్షయ్); అలుగు (రుష్); ఇలుగు (రిశ్); ఈగూ (ఈజ్); ఈలుగు (లీ); మెదగు (మృద్).

2. ధాతువు: అగు (భూ); తగు (స్థగ్).

3. ధాతువు + కర్మణి 'య' + కృ: బిజుగు (బ్రూ).

4. క్రియాజన్య విశేషణము + కృ; కడుగు (క్షాలిత); కలుగు (కృత); చెలగు, చెల్గు, సెలగు (ఛిత్త, ఛిన్న), తల్గు (ధూత), తొడుగు (ధృత); నుడుగు, నొడుగు (నుత); పొడుగు (వృద్ధ); పొదుగు (పుష్ట).

5. ఉపసర్గము + ధాతువు + కృ: ఒర (ఱ)గు (ఉద్వర్త్); విసుగు (వ్యస్); వేగు (విలస్).

6. ఉపసర్గము + క్రియాజన్య విశేషణము + కృ; ఉడుగు (అప-,ఉపహత); ని (నీ)లుగు (నిర్వృత).

7. అవ్యయము + కృ: విడు(ఱు)గు (పృధక్).

8.-గ్గు.

1. ధాతువు + కృ: ఇగ్గు (ఇజ్); గగ్గు (గద్); డ(ద)గ్గు (దహ్); డి(ది)గ్గు(డీ); సుగ్గు (సుద్); మ(మ్ర)గ్గు (మ్లా, మృద్).

2. ఉపసర్గము + ధాతువు + కృ: నిగ్గు, నెగ్గు (నిర్వహ్).

9.-చు.

1. క్ష్, చ్, శ్, ష్, స్- అంతమందుగల ధాతువులు: అలచు (అలస్); ఊచూ (ఉజ్ఘ్), ఇది 'ఉద్ + కృ' నుండిపుట్టి గకారము చకారముగా మాఱుటవలన నైనను గలుగవచ్చును. కలచు (కలుష్); క్రాచు(కర్శ్); నాచు (నశ్); పూచు (పృచ్); రేచు (రిచ్); లాచు (లష్); వ్రేచు (వ్రశ్చ్).

2. త్, థ్, ర్ మొదలగున వంతమందుగల ధాతువులు + య - వికరణ చిహ్నము; ఏచు (ఏష్య్); చాచు (సాధ్య్); నోచు (కుత్య్); మెలచు (మిల్ + య); వేచు (వ్యధ్ + య).

3. ధాతువు + అఛ్ = అస్ (అఛ్ అను ధాతువు ధాతుకోశములలో లేకున్నను నట్టిదుండవలెనని శబ్దశాస్త్రజ్ఞులభిప్రాయపడుచున్నారు. ఈ ధాతుసంయోగమువలననే యాధునికార్యభాషలలోని చకారాంత ధాతువులు కొన్ని కలిగినట్లు వారు నిర్ధారించియున్నారు.) అడ(ణ)చు, ఆచు