పుట:Andhra bhasha charitramu part 1.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(ఇష్); ఏగు (ఇ); కరగు (ఘృ); కలగు (క్లిశ్); కా (క్రా)గు (కాశ్); కోగు, గోకు (కృత్, కృంత్); గొడ (ణ)గు (గుంజ్); చెలగు (చల్), చాగు (సాధ్); తునుగు (త్రుట్); తూగు (తుల్); తొరుగు, తొఱగు, తొడగు (స్తృ); వెరుగు, వెర్గు (వృధ్); పొసగు (పుష్);మడ (ణ)గు, మడగు, మడ్గు (మృద్); మసగు (మస్జ్); సరగు, సురుగు (సృ); తో (డో< దో)గు (ధును).

2. ఉపసర్గము + ధాతువు + కృ: ఊగు (ఉద్వీజ్); ఒదుగు (ఉద్ధృ); ఒసగు (ఉపాస్); నీగు (నివృత్); పసగు (ప్రసృ); బెడగు, వెలుగు (విలస్).

3. క్రియాజన్య విశేషణము + కృ: కడ(ణ)గు (కృత); చిను(డు)గు (ఛిన్న); తొడగు (ధృత); తొలగు (తృత); పెనగు (పినద్ధ); మొఱ(ఱు)గు, మ్రోగు(ముఖర)

4. ధాతువు + కృ: దాగు (ధా); మా (మ్రా)గు (మ్లా); మూగు(ముష్); మే(మ్రే)గు (మృజ్); రగు (రిచ్); వీగు (విజ్); వే(వ్రే)గు (వ్యధ్); సాగు (సాధ్).

5. తర్ధితము + కృ: మెసగు (ఆమిష్)

6. విశేషణము + కృ: లోగు (తుచ్ఛ); చూ. హిం. లుచ్ఛా.

పై యుదాహరణములలోని యర్ధానుస్వారోచ్చారణము (1) సహజముగ ననుస్వారయుక్తముగ బలుకు స్వభావముచేతను (2) దాతువులోనే యనునాసికముండుటచేతను (3) -ను -- నా - స్ -, అను వికరణ చిహ్నముల కలయికచేతను సంభవించి యుండును.

6.-౦గు.

1. ధాతువు + కృ: క్రుంగు (క్రు--); డంగు, దంగు (దంశ్); డొంగు, దొంగు. (ధా); దొంగు (తుల్); త్రుంగు (త్రుట్); నంగు (నస్, చూ. నాసికా. హిం. నాష్తా); పొంగు (ప్లుత్); బ్రుంగు (బ్రూ); మ్రంగు (మృద్).

2. ఉపసర్గము + ధాతువు + కృ: ఉప్పొంగు (ఉత్ల్పత్).

3. తద్ధితము + కృ: మ్రింగు (ఆ-మిష్).

4. విశేషణము + కృ: లొంగు (తుచ్ఛ; చూ. హిం. లుచ్ఛా).

7.-గు.

1. ధాతువు + కృ: అరుగు (ఋ); ఒదుగు (వ్యధ్); కసగు (కర్ష్, ఘర్ష్); గొరుకు (క్షుర్); చెఱుగు (శూర్ప్); చాగు (సాధ్); జరగు, సొరగు (సృ);