పుట:Andhra bhasha charitramu part 1.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. ధాతువు + కర్మణి ప్రత్యయమగు 'య' + కృ:డీ + య + కృ = డింకు; బ్రూ + య + కృ = బొంకు.

6. సంస్కృత ధాతువు కొననుండు తాలవ్య వర్గీయ హల్లు కంఠ్య వర్గీయ హల్లుగ మారుట: కుంచ్, క్రుంచ్ = కుంగు, క్రుంగు.

3. కు.

1. ధాతువు + వికరణచిహ్నము + కృ:రిశ్ + కృ = ఇఱుకు; రుహ్ + కృ + ఉఱుకు; ఉష్ + కృ = ఉడుకు; ఛిద్ + కృ = చితు (దు) కు; చివుకు; తన్ (తస్) + కృ = తనుకు, దనుకు; తుష్ + కృ = తసుకు; వర్త్ (వృధ్) + కృ = వడకు; విష్ + కృ =వెత (ద,న) కు; ధృ + = దొరకు; నట్ + కృ = నడుకు; నశ్ (నష్) + కృ = నఱకు; నుద్ + కృ = నూకు; బ్రూ + కృ = పలుకు; విధ్ (వేధ్) + కృ = పితు (దు)కు; పిష్ + కృ = పిసుకు; పుట్ + కృ =పుడు (ణు) కు; భ్రశ్ + కృ = బెసుకు; వృధి (వర్ధ్ + కృ = బ్రతు (దు)కు; మిఞ్జ్ + కృ = మినుకు.

2. ఉపసర్గము + ధాతువు + కృ: ఉచ్ + ధాన్ + కృ = ఉతు (దు)కు;ఉద్ + ప్లు + కృ = ఉబుకు, ఉద్ + స్థా + కృ = ఒలుకు; వి + లస్ + కృ = బెళుకు, మెలకు

3. ఉపసర్గము + ధాతువు:అధి + కృ = అడు (తు, దు)కు.

4. క్రియాజన్య విశేషణము + కృ: కుస్ + త + కృ = కులుకు; ఛిన్న + కృ = చినుకు, చిలుకు; ధృత + కృ = తొడుకు, ధూ (ధు) త + కృ = తొలుకు, తొణుకు.

5. క్వద్రూపము + కృ: లయ + కృ = లసుకు.

4. క్కు.

1. ఉపసర్గము + కృ: ఉద్ + కృ = ఉక్కు.

2. ధాతువు + కృ: ఏధ్ + కృ = ఎక్కు; క్రుఞ్చ్ + కృ = క్రుక్కు; చష్ + కృ = చెక్కు; సుఖ్ (శుష్) + కృ = చొక్కు; తిజ్ + కృ = తిక్కు; తుజ్ (తుడ్, ధృష్) + కృ = తొక్కు, త్రొక్కు; తజ్ + కృ = దక్కు; నక్ + కృ = నక్కు; నుద్ + కృ = నొక్కు; ప్లుష్ + కృ = పొక్కు; భుజ్ + కృ = బొక్కు; మ్లా + కృ = మక్కు; ముష్ + కృ = ముక్కు; విజ్ + కృ = విక్కు; శుష్ + కృ = స్రుక్కు; భ్రశ్ + కృ = వక్కు.

5. గు.

1. ధాతువు + వికరణ చిహ్నము + కృ: అడ (ణ, న)గు, ఆగు (అడ్); అలగు (అలస్); వీగు, ఈగు (విద్); ఎరగు, ఎఱగు (ఏష్); ఎసగు (-వు)