పుట:Andhra bhasha charitramu part 1.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భాషలో నుండుటచేత నానాటి మతాచార్యులు హీబ్రూభాషలో నెక్కువగా కృషిచేయ మొదలుపెట్టిరి. హీబ్రూభాష స్వర్గములో దేవతలుమాట్లాడు భాష యను నభిప్రాయము స్థిరపడుటచేత, ప్రపంచములోని భాషలన్నియు హీబ్రూభాషాజన్యములే యను నభిప్రాయము కుదురుకొన్నది. హీబ్రూభాష సెమెటిక్ భాషా కుటుంబములోనిది. ఈ సెమెటిక్ భాషల స్వభావ మానాటివారికి తెలిసియుండలేదు. ఈ సెమెటిక్ భాషల నిర్మాణమునకును, యూరోపియను భాషల నిర్మాణమునకును నెట్టి సంబంధమును లేకపోయినను, యూరోపియను భాషలు హీబ్రూభాషాజన్యములే యను నిశ్చయముచేత, హీబ్రూ పదములకును యూరోపియను భాషా పదములకును నేదో యొకరీతిగా ముడిపెట్టుట కారంభించినారు. అందువలన భాషాశాస్త్ర మెన్నో దోషములపా లయినది. హీబ్రూభాషను కుడినుండి యెడమ వైపునకు వ్రాయుదురు; ఆ పద్ధతినుండియే యూరోపియను భాషలలో నెడమనుండి కుడివైపునకు వ్రాయుపద్ధతి పుట్టినదని యూహించినవా రగుటచేత, నెట్టి మాటలనయినను వానిలోని యక్షరములను, ధ్వనులను తారుమారు చేసి, మార్చి, చేర్చి, యర్థసామ్య మెంతదూరముగా నున్నను సరే, వారు యూరోపియను శబ్దములకు హీబ్రూ ప్రకృతుల నేర్పాటు చేయుచుండిరి. ఈ రీతిగా నెవరి యిష్టానుసారము వారు తమయూహల ననుసరించి వ్యుత్పత్తులను గల్పించినను, నిందువలన భాషాశాస్త్రము మొట్టమొదట తప్పుత్రోవ త్రొక్కినను, కొంత కాలమునకు శబ్దజాలము నొకచోట జేర్చి, వర్ఘీకరణము చేయుటచేత, తరువాతివారు కొంత నిదానముతో నాయా శబ్దములను గుఱించి శాస్త్రీయదృష్టితో నాలోచించుటకు మార్గ మేర్పడినది.

ప్రాచీన గోధానికు (జెర్మానికు) భాషలలో 'పుల్ఫిలా' అను నతడు వ్రాసిన బైబిలుయొక్క గాధికు భాషాంతరీకరణము మొదలయిన గ్రంథము లీ లోపుగా బయలుపడినవి. అదే సమయమున నాంగ్లో - సాక్సను (ప్రాచీనాంగ్లభాష), జర్మను, ప్రాచీన ఐస్లాండికు భాషలలో గూడ బైబిలు వ్రాయబడినది. ఇందు మూలమున 18, 19 శతాబ్దములలో నీభాషా కుటుంబమునుగుఱించి చారిత్రాత్మక మగు వ్యాకరణము వ్రాయుట కవకాశ మేర్పడినది. అయినను నాకాలములో భాషాచరిత్రనిర్మాణముమీద దృష్టి తక్కువయనియే చెప్పవలెను. ఏదోయొకభాష పరిణామమును గుఱించి యెక్కువగా నాలోచింపక, యప్పటి విద్వాంసులు వ్యవహారములో నున్న యనేక భాషలలోని శబ్దజాలము నొకచోట చేర్చుటయందే శ్రద్ధవహించియుండిరి. ఇట్టివారిలో లీబ్‌నిజ్ అను తత్త్వవేత్త ముఖ్యుడు. ప్రపంచ మంతటికిని సామాన్యముగా నొక భాషను నిర్మింపవచ్చునని యీతని నిశ్చయమగుట