పుట:Andhra bhasha charitramu part 1.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొకటి జిగురుతో నంటించిన ట్లంటించుటవలన సంపూఋనక్రియ లేర్పడుచున్నవనియు, నీ విధానము సంస్కృతములో లేదనియు గాల్డువెల్ పండితుడు తెలిపియున్నాడు. సంస్కృతములో నీవిధానము లేదన్నమాట నిజమే కాని సంస్కృతముతో సంబంధించిన నేటి యార్యభాషలం దీవిధానమే కానబడు చున్నది. బంగాళీ భాషనుండి యీ క్రింది యుదాహరణముల నీయవచ్చును.

-- ధాతువు అనుబంధము పురుషవచన ప్రత్యయము
ఉత్తమపురుషము, ఏకవచనము: నున్ + ఇ + హు
-- విను + చున్నా + ను,
మధ్యమ చల్ + అ +
-- చల్‌ఇంచు + చున్నా + వు
ప్రథమ చల్ + ఏన +
-- చలించు + చున్నా + డు
ప్రధమ చల్ + ఈయ్ +
-- చలించు + ఇ + ఎ(ను).
ఉతమ జాణ్ + ఆయిల్ +
-- తెల్ + ఇపెద్ + అను.
ప్రథమ నేఉట్ + ఇ +
-- నెవడు + ఇ + ఎ(ను).

పై యుదాహరణములలో ధాతుప్రత్యయ సంయోగ మేకరీతిగ నుండుటకు గమనింపవచ్చును. ఇట్లే యితరాధుని కార్యభాషలనుండియు బ్రాకృతభాషలనుండియు నుదాహరణముల నియవచ్చును. కాల్డువెల్లు పధకము ననుసరించినచో 'నెవడెను' అనుక్రియను విభజించి 'ఎ' పురుష - వచన ప్రత్యయముగను, '-ఇ' లజ్ - ప్రత్యయముగను, '-అడ్‌' ఉపవిభక్తిగను, తొలగించి, 'నెవ్‌' అనునది ధాతువుగ నేర్పఱుపవలసి వచ్చును. బంగాళీ భాషలో 'నేఉట్‌' అనునదియు, తెనుగులో 'నెగడు, నెవడు' అనునదియు సంస్కృతమందలి 'నిర్ + వృత్‌' అనువాని సంయుక్త రూపమునకు వికారమని శబ్దశాస్త్రజ్ఞులుకాని, సాధారణజనులకు దెలియదు. బంగాళీలో 'నే ఉ' - తెనుగులో 'నెవ్‌' అనునవి ధాతువులనుట సరికాదుగదా. అట్లే బంగాళీలోని 'నున్‌' అను ధాతువులో 'ను' అను వికరణ సంజ్ఞ చేరియున్నది.