పుట:Andhra bhasha charitramu part 1.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. అజాది శబ్దముల యాద్యచ్చునకు గొన్ని యెడల లోపము గలుగుము.

13. పదమధ్యమందలి యచ్చొకప్పుడు లోపించుటచే రెండుహల్లులు సంయోగమునొంది, సంయుక్తాక్షరములకు గల్గు వికారముల నొందుచుండును.

14. కొన్నియెడల బదమధ్యమందలి యచ్చు తాను కూడియున్న హల్లుతోగూడ లోపించును.

15. య, వ, లకు సంప్రసారణము గలిగి యకారము ఇకారముగను వకారము ఒకారముగను గొన్నియెడల మాఱును. అట్లుమాఱిన యిత్వమేత్వమును ఉత్వమోత్వమును గూడబొందును.

16. 'అవ' 'ఓ'గను 'అయ' 'ఏ'గను మాఱును.

17. సంధియం దుద్వృత్తాచ్చులకు, అనగా నేక పదమధ్యమందలి హల్లు లోపింపగా మిగిలిన యచ్చులకు మహారాష్ట్ర్యాది భాషలయందు సంధి కలుగక యవి యట్లే నిలుచును. అపభ్రంశ భాషయం దాయుద్వృత్తాచ్చులకు వివిధముగ సంధికలుగుటయో, వాని మధ్యమున వేర్వేఱు హల్లులు, ముఖ్యముగ య, వ, లు, చేరుటయో సంభవించును సాధారణముగ సమస్త పదములందు అ, ఆ + అ, ఆ = ఆ; ఇ, ఈ + ఇ, ఈ = ఇ, ఈ; ఉ, ఊ + ఉ, ఊ = ఉ, ఊ, లుగ సంధి నొందుచుండును. అ, ఆ + ఇ = ఏ; అ, ఆ + ఉ = ఓ,గా సమస్త పదములందే సంధినొందును. అ, ఆ, లపై నసవర్ణాచ్చు చేరునప్పుడు సమాసములందును నుద్వృత్తాచ్చు లట్లే నిలుచుటయుగలదు. నఞ్ సమాసమందలి అ-కు బదులు ణ, నలును వచ్చును. ఒక్కొకచో బూర్వస్వరము నిలిచి పరస్వరము లోపించును; ఒకానొకచో 'ర్య'కు బూర్వమందలి యకార మేకారమగును. ఉపభాషలగు నపభ్రంశ భేదములం దచ్చుల యందలి మార్పు లొకవిధముగ నుండవు. కొన్నియెడల నచ్చుల కనుస్వారోచ్చారణము కలుగును.

హల్లులనుగూర్చిన కొన్ని విశేషములు.

(1) ఒకప్పుడు సంయుక్తాక్షరములలోని మీదిహల్లు లోపించును. ఉదా. స్థల = థల.

(2) ఒకప్పుడనునాసికాక్షరములతో గూడిన సంయుక్తాక్షరమున నను నాసికమునకు మాఱుగ ననున్వారము వచ్చును. పజ్త్కి = పంతి.