పుట:Andhra bhasha charitramu part 1.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అచ్చుల విషయమున గొన్ని విశేషములు.

1. రేఫతో సంయోగమునొందిన సంయుక్తాక్షరములోని యొక హల్లు లోపించినప్పుడు సంయుక్తాక్షరమునకు బూర్వమందుండు హ్రస్వాచ్చునకు దీర్ఘము వచ్చును.

2, అట్లే శ, ష, సలతో సంయోగమునొందిన సంయుక్తాక్షరములకు బూర్వమందుండు హ్రస్వాచ్చులకును దీర్ఘము కలుగును.

3. శ్ర, ష్ర, స్ర, లకు బూర్వమందుండు హ్రస్వాచ్చు విషయమున గూడ నిట్లేయగును.

4. య, వ, శ, ష, స, లు ద్వితీయాక్షరముగా గలిగిన సంయుక్తాక్షర పూర్వ హ్రస్వాచ్చుల విషయమునను నిట్లే యగును.

5. ఎ, ఒ, అను హ్రస్వవక్రములుగూడ బ్రాకృతమున గలవు. ఇవి సాధారణముగ ద్విత్వాక్షరములకు బూర్వమందే యుండును.

6. మయట్ప్రత్యయ పూర్వ హ్రాస్వాచ్చునకు దీర్ఘము కలుగును.

7. కొన్నియెడల ద్విత్వాక్షరములకనుస్వారము చేరుచుండును.

8. కొన్నియెడల ననుస్వారములోపించి, దాని పూర్వహ్రస్వాచ్చునకు దీర్ఘము వచ్చును.

9. కొన్నియెడల ప్రధమ హల్లుమీది హ్రస్వాచ్చునకు దీర్ఘము కలుగును.

10. కొన్నియెడల దీర్ఘాచ్చులు హ్రస్వము లగుచుండును.

11. కొన్నియెడల సంయుక్తాక్షరములకు విశ్లేషముకలిగి వాని మధ్యమున నొక యచ్చు చేరుచుండును.