పుట:Andhra bhasha charitramu part 1.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్తి తాలూకాలలోని నల్లరేగడ భూములలో అధికముగను గానవచ్చుట గమనింపదగినది. ఇట్లే, మధురజిల్లాలోని తిరుమంగళము తాలూకా నల్లరేగడ భూములకు ప్రసిద్ధి; ఇచట తెనుగు వారెక్కువగ నున్నారు. ఆ జిల్లాయందే మేలూరు తాలూకాలో పచ్చని భూము లున్నవి; ఇచట తెనుగువా రంతగా లేరు........

(ఈ) IV. పడుమటి తీరము:- ఈ తీరమున గూడ తెనుగువారు స్థిరనివాసము నేర్పఱుచుకొని యున్నారు. దక్షిణ కనరా జిల్లాలోని 'కొరగ' లట్టివారు. వీరికొక రహస్యభాష యున్నది. ఇతరులు వినుచుండగా వారు దానిని మాట్లాడరు. కాని, అది తెలుగును బోలి యుండునని తెలియుచున్నది. వీ రనంతపురమునుండి యొక రాజు సేనతో నా ప్రదేశమునకు వచ్చియుండినట్లు వీరియందొక యైతిహ్యమున్నది.

తెలుగువారి యుపభాషలు.

తెనుగు మాతృభాషగా గలిగి మఱియొక దాని నుపభాషగా వాడుచుండు తెనుగువారి సంఖ్య, తమిళము మాతృభాషగా గలిగి యుపభాషల నవలంబించిన తమిళుల సంఖ్యకంటె నాఱురె ట్లధికముగా నున్నది. ఈ భేదమువలన తెను గెంత విరివిగ వ్యాపించియున్నదో తెలియగలదు. హిందుస్థానీ భాష, మాట్లాడువారికంటెను తెనుగు మాతృభాషగా గలవా రెక్కువగ ననేక ప్రదేశములందు వ్యాపించియున్నారు. తెనుగువారెక్కువగ నుపయోగించు నుపభాష తమిళము; కాని, తక్కిన భాషలు మాట్లాడువారు కొలదిగనో గొప్పగనో తెనుగును మాట్లాడుచుందురు. గోదావరి, కృష్ణా జిల్లాలలో తెను గెక్కువగా నుండుటవలన నిచటి వారి కుపభాషలులేవు; పుదుక్కోట సంస్థానములోని తెలుగువారిలో నూటికి తొంబది యెనిమిది మంచి తెనుగునే నిత్య జీవనమున వాడుదురు....... దెలుగువారునిజముగ 'దక్షిణాపథ విహారి' యని వర్ణింపవచ్చును, భాషలను నేర్చుకొనుటయందత -------- వాడు."

II

చెన్న రాజధానిలోని జనసంఖ్యలో ప్రతి 10,000 మందికి నాయాభాషల మాట్లాడువారిక్రింది విధముగ నున్నారు:-

-- 1931 1921 1911 1901
తమిళము 4013 411 400 4035
తెలుగు 3768 3772 3769 3706
మళయాళము 790 754 740 739
ఒఱియా 392 368 383 468
కన్నడము 366 361 382 406
హిందుస్థానీ 260 234 233 230
తుళు 121 126 122 128

III

ఉపభాషలు (Dialects).

తెనుగు మాట్లాడువారు తమభాషకు పేళ్లుగా చెప్పుకొనిన కొన్ని శబ్దములు:- గంజాముజిల్లా దరుల (2);