పుట:Andhra bhasha charitramu part 1.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చరిత్రము వ్రాయునప్పు డొకవంక తక్కిన ద్రావిడభాషలకును మఱి యొకవంక ప్రాచీన ప్రాకృతభాషలు, నేటి యార్యభాషలకును గల సంబంధములను పోలికలను జూపుట యావశ్యకమగును. ఈవిషయమై పరిశోధనమును గ్రొత్తగ నారభించి యుండుటచే నిందు గొన్ని స్ఖాలిత్యము లుండవచ్చును. చిన్నచిన్న వివరములలో నభిప్రాయ భేదము లచ్చటచ్చట గలిగినను గ్రంధమును ౙదివిన వెనుక మొత్తముమీద నాంధ్ర భాషయు దానితో సంబంధించిన యితర ద్రావిడభాషలును బ్రాకృత భాషాభేదములే యను నభిప్రాయము పండితుల మనస్సునం దంకురించినదో నదియే నేను చేసిన కృషికి బ్రతిఫలము కాగలదు.