పుట:Andhra bhasha charitramu part 1.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


12. ద్రావిడభాషలలో సంబంధార్థక సర్వనామములు లేవు. వాని యర్థమును దెలుపుటకు సంబంధార్థక క్రియాజన్య విశేషణములు వాడుకలో నున్నవి.

సమాధానము.

ద్రావిడభాషలలో సంబంధార్థక సర్వనామములు లేవనుట సరికాదు. యావను, ఎవన్, ఎవడు మొదలగునవి సంబంధార్థక సర్వనామములే. ఇవి సంస్కృతములోని య: అను సంబంధార్థక సర్వనామమునకు వికారములే. ప్రశ్నర్థక సర్వనాముము ద్రావిడభాషలలో లేదనియు సంబంధార్థక సర్వనామమే ప్రశ్నార్థమున నుపయోగింప బడుచున్నదనియు జెప్పుట యుక్తము.

13. ద్రావిడభాషలయందలి నార్య నిర్మాణపద్ధతి సంస్కృతమునకు భిన్నముగా నున్న దీనికి సమాధాన మింతకు ముందీయబడియే యున్నది.

ద్రావిడభాషలయందు తెనుగున కీయదగిన స్థానము.

ద్రావిడభాషల కన్నిటికిని మూలభాష యొకటి యుండవలెను. అట్టి భాషయొక్క లక్షణములు చాలమట్టుకు నేటి తమిళ భాషయందు నిలిచి యున్నవనియు, నందుచే నదియే ప్రాచీనతమ ద్రావిడభాష యనియు కాల్డ్వెల్ మున్నగువారు తలంచియుండిరి కాని యిటీవలి పరిశోధనముల మూలమున బ్రాచీన ద్రావిడభాషా లక్షణములు తెలుగు మొదలగు భాషలయం దెక్కువగ నున్నవని తెలిసినవి.

తమిళ మళయాళము లొక భాషకు ----- శాఖలు. కన్నడము తమిళముతో గొన్ని పోలికలను కలిగియున్నను నెక్కువ విషయములందు తెనుగుతో సంబంధించి యున్నది. తుళు, కొడగు, తొద, కోత భాషలు తమిళకన్నడములకు మధ్యస్థానము నాక్రమించియున్నవి. కురుఖ్, మల్తొ భాషలకును నాస్థానమునే యివ్వవలెను. ఇ, కోందుభాషలు తమిళమును కంటె దెలుగునే యెక్కువ పోలియున్నవి. లోలామీ, నాయకీ, భీలీ భాషలకు గూడ నదియేస్థానము నీయవలయును. తెలుగుభాష తక్కిన ద్రావిడ భాష లన్నిటికంటె స్వతంత్రమగు స్థానము నాక్రమించుచున్నదని గ్రియర్‌సన్ పండితుని యభిప్రాయము.

తెలుగునకు గల యీ ప్రత్యేకత్వమునకు గారణమేమి? ప్రాచీన ప్రాకృతభాషల కిది తక్కిన ద్రావిడభాషలకంటె నెక్కువ దగ్గఱగా నుండుటయే యని యీ గ్రంధమును జదువుచున్నపుడు గోచరింపగలదు. ఆంధ్రభాషా