పుట:Andhra bhasha charitramu part 1.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందీ: రామ్; తెలుగు: రాముడు.

-- ఏక. -- బహు --
-- హిందీ తెనుగు హిందీ తెనుగు
ప్ర రామ్ రాముడు రామ్-లోగ్ రాములు
ద్వి రామ్-కె రాముని రామ్-లోగన్-కె రాములను
తృ రామ్-సే రామునిచే,రామునితో రామన్-లోగ్-సే రాములచే, రాములతో
రామ్-కే రామునికై రామన్-లోగ్-కే రాములకై
రామ్-సే రామునికంటె రామన్-లోగ్-సే రాములకంటె
రామ్-కే రామునికి రామన్-లోగ్-కే రాములకు
రామ్-మే రామునియందు రామన్-లోగ్-మే రాములందు
సం హేరామ్ ఓరామ హేరామన్-లొగ్ ఓరాములారా

3. " ద్రావిడభాషలలో నమహద్వాచక శబ్దములకు బహవచనరూపములులేవు. క్రియలలో నమహద్బహువనము లింకను నరుదుగనున్నవి. సంస్కృతములో నట్లుగాదు."

సమాధానము

తమిళములో బూర్వకాలమున నెట్లున్నను నేటి తమిళమునందును నితర ద్రావిడభాషలయందును నిట్టివాడుక కానరాదు. ప్రాకృతావస్థలో నేక వచన బహువచన రూపములకు భేదము పోయినది. నేటి యార్యభాషలలో గూడ నట్లే యున్నది. బహుత్వమును దెలుపుటకు నేటి యార్యభాషలయందు ప్రత్యేక సమూహవాచక శబ్దములుపయోగింపబడుచున్నది. అట్లే ప్రత్యేక ద్రావిడభాషలయందును గాన్పించుచున్నది.

5. "ఇండో యూరోపియను భాషలలో గ్రియల కుపసర్గములు చేరుచుండును. ద్రావిడభాషలలో నుపసర్గములులేవు. వానికి మాఱుగ బ్రత్యేక శబ్దములు పదముల తఱువాత చేరుచుండును."

సమాధానము

ప్రాకృతభాషలలోనే యుపసర్గలు ధాతువులతో గలసిపోయి వికారమునుబొంది, యవి యుపసర్గలను గుర్తులేకుండ బోయినవి. ఉపసర్గలతో గూడిన సంస్కృతధాతువులు ప్రత్యేకధాతువులుగా బ్రాకృతములో వెలసి