పుట:Andhra bhasha charitramu part 1.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాధారములు లేవు. క్రీస్తుపూర్వము 3 వ శతాబ్దమునుండి క్రీస్తుశకము 5 వ శతాబ్దము వఱకును భారతడేశమందంతటను బ్రాకృతభాషలు ప్రచార మందుండినట్లు మనకు దెలియును. నాటనుండి 6, 7 వ శతాబ్దములవఱకు దక్షిణహిందూదేశము నందును, 12 వ సతాబ్దమువఱకును తక్కిన భారత వర్షమునందును ప్రచారమునం దుండినభాషల స్వరూపమెట్లుండెనో తెలిసికొనుట కాధారములులేవు. అట్టిసందర్భమున ద్రావిడ భాషల మూలమున బ్రాకృతభాషలను నేటి యార్యభాషలును కలిగినవని యూహించుట సమంజసము కాదని తోచుచున్నది. కావున నా యభిప్రాయమునకు దగినయాధారములు నిరూపింపబడు వఱకును బూర్వలాక్షణికులతో నేకీభవించి ద్రావిడభాషలుగూడ బ్రాకృతభాషలే యనియు దక్కిన ప్రాకృతభాషలెట్లు గలిగినవో ద్రావిడ భాషలును నట్లే గలిగినవనియు బ్రాకృతభాషలపై ద్రావిడీ ప్రాకృతమున కెంతటి ప్రోద్బలము కలిగెనో ద్రావిడభాషలపై గూడ దక్కిన ప్రాకృతభాషల వలన నంతప్రోద్బలము గలిగెననియు బ్రాచీనార్యభాషలనుండి తక్కిన ప్రాకృతములవలె ద్రావిడభాషలును వికాసము నొందినవనియు దలంచుచు నాదృష్టితో బరిశోధనముల సాగించినచో ద్రావిడభాషా తత్త్వము తేలగలదని చెప్పుట సాహసము కానేరదు.

కాల్డ్వెల్ సిద్ధాంతమును గూర్చి విచారించుట యిచ్చట నప్రస్తుతము కానేరదు. ఆత డేయే విషయములందు సంస్కృతమునకును ద్రావిడ భాషలకును సంబంధము లేదని తెలిపెనో యావిషయములందెల్ల ద్రావిడ భాషలకును బ్రాకృతములకును సంబంధము కానవచ్చుచున్నది. కాల్డ్వెల్ తన సిద్ధాంతమునకు బోషకములుగ జూపిన యుపపత్తులును వానికి సమాధానములును నీక్రింద చూపబడుచున్నవి.

1. "ద్రావిడభాషలలోని శబ్దజాలమునందు సంస్కృతేతరభాగము సంస్కృతభాగముకంటె నెక్కువగానున్నది."

సమాధానము.

కాల్డ్వెల్ సంస్కృతేతరభాగమనుకొన్నది నిజముగ బ్రాకృత భాగము. కేవల దేశ్యమని తలంపబడు ద్రావిడ శబ్దజాలము ప్రాకృతమార్గమున నెక్కువగ వికారము నొందినదై యున్నది. నిజముగ దేశ్యమైన భాగము కొలదిగనే యున్నదని పరిశోధనము వలన దేలగలదు.

2. "ద్రావిడభాషలలోని సర్వనామ సంఖ్యావాచక శబ్దములును సుప్తిజ్ ప్రత్యయములును వాక్యనిర్మాణమును - అనగా భాషకు జీవమన