పుట:Andhra bhasha charitramu part 1.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిథియను సంబంధములు కనబడిన చోట్లనెల్ల నిండో యూరోపియను సంబంధములుగూడ బొడగట్టుచునే యుండెను. ఆతడు వానినిగుర్తించి యుండక పోలేదు. కాని యాతని యభిప్రాయమంతయును సిథియను సిద్ధాంతము ప్రక్క కొరగి యుండుటచే నాత డిండో-యూరోపియను సంబంధముల నంగీకరింప లేకుండెనని యాతని గ్రంధమును చదివినవారికి స్ఫురింపక పోదు. విశేష్యముల బహువచన ప్రత్యయమగు నకారము, పదప్రత్యయ సంయోజన విధానము, ద్వితీయావిభక్తి ప్రత్యయములగు మకార నకారములు, చతుర్థీవిభక్తి ప్రత్యయము, ఇన్ అను షష్ఠీవిభక్తిప్రత్యయము, అ, ఇంద్రె అను షష్ఠీవిభక్తి ప్రత్యయములు, ఇల్ అను సప్తమీవిభక్తి ప్రత్యయము, ఒందు, అంజు, ఎట్టు అను సంఖ్యా వాచకములు, ఉత్తమ మధ్యమ పురుష సర్వనామములు ఆత్మార్థక సర్వనామము, సర్వనామముల బహువచన ప్రత్యయములు, నిర్దేశార్థక సర్వనామ విశేషణములు గౌరవార్థక సర్వనామములు, భూతార్థక తప్ప్రత్యయము, భూతార్థక్రియలయం దామ్రేడితము, భూతార్థకములగు ఇ, ద, ప్రత్యయములు, భవిష్యదర్థ బోధక ప్రత్యయములు, శబ్దజాలము,- ఈ విషయముల జర్చించిన సందర్భములనెల్ల నాతని కిండో యూరోపియను సంబంధములు కనబడుచునే వచ్చినవి. కాని యాతడు వాని నన్నిటిని నిరాకరించెను.

ఇటీవల జరిగిన పరిశోధనముల ఫలితముల మూలమున గ్రియర్ సన్ పండితుడు కాల్డ్వెల్ చేసిన సిధియను సిద్ధాంతము నెట్లు నిరాకరించెనో యింతకుముందు తెలుపబడియున్నది. సిధియను జాతిగాని, సిధియను భాషా కుటుంబముగాని, లేనప్పుడు సిధియను సిద్ధాంతము నిలుచుట కవకాశము లేదు కదా.

కాల్డ్వెల్ కాలమునకు బ్రాకృత భాషలనుగూర్చికాని, ఆధునికార్య భాషలను గూర్చికాని పరిశోధనము లెక్కువగా జరిగియుండలేదు. ఇటీవల జరిగిన పరిశోధనముల ఫలితములను సునీత్ కుమార్ ఛాటర్జీ పైన వివరించి నట్లుగా నొక్కచోట జేర్చియున్నాడు. ఆతడు చూపిన సంబంధములే కాక యింక నెన్నిటినో చూపవచ్చును. ద్రావిడభాషలు ప్రాకృతములుకావను కొనుటచే నార్యభాషలు వేఱనియు, ద్రావిడభాషల ప్రోద్బలమువలన నార్యభాషలు ప్రాకృతములుగాను, నేటి యార్యభాషలుగాను బరిణమించినవనియు చెప్పుట సంభవించినది. ప్రాచీన ఇండో_ఆర్యభాషలు నేటి యార్యభాషలుగా మాఱుట యవి సహజముగ సొంతమార్గమున బరిణమించుటచేతనైనను, ఇతరభాషల ప్రోద్బలము చేతనైనను కలిగియుండ వచ్చును. నేటి పరిశోధకులు రెండవ కారణమును దెలుపుచు ద్రావిడభాషల నార్యభాషలనుండి ప్రత్యే