పుట:Andhra bhasha charitramu part 1.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్నడము: మనుష్యను ఒళ్లేయవను; తెలుగు: మనుష్యుడు మంచివాడు.

నుడికారములో రెండు కుటుంబములకును మిక్కిలి దగ్గఱ పోలికలున్నవి.

(i) 'అని' అను క్త్వార్థక శబ్దముల యుపయోగము:- బంగాళీ: బొలియా; తూర్పుహిందీ: బోల్-కే; మరాఠీ: మ్హణూన్; సింహళీ: కియా; తమిళము: ఎన్ఱు; కన్నడము: ఎందు; తెనుగు: అని.

(ii) క్రియల లోట్ రూపములకు మాఱుగ తుమున్నంతాది రూపములను వాడుట:- పశ్చిమహిందీ: యహ్‌కామ్ కర్నా; కన్నడము: ఈకెలస మాడువుదు; తెనుగు: ఈపని చేయునది.

(iii) క్రియల లోడ్రూపమున కొకయర్థమున 'నిచ్చు' ధాతువు రూపములకు వాడుట:- సంస్కృతము: వదాని; బంగాళీ: ఆమాకే బొలితే దేఓ; హిందోస్థానీ: ముఝే బోల్నేదో; తెనుగు: నన్ను చెప్పనిమ్ము, చెప్పనీ.

ఇండో-ఆర్యభాషల కీపోలిక లిండియాకు వెలుపలనున్న యిండో-యూరోపియను భాషలతోలేవు. ఈ విషయమున నార్యభాషలపై ద్రావిడ భాషల ప్రోద్బలమున్నదని చెప్పక తప్పదు.

IV. శబ్దజాలము.

ఆర్యభాషలు భరతవర్షమును జొచ్చిననాటినుండియు నందు ద్రావిడభాషాపదములు గలియుచునే యున్నవి. బ్రాహూఈ జాతివా రిండియాకు వెలుపలనున్న ద్రావిడజాతివారే. ఐరానుదేశములో నితరద్రావిడభాషల వారుండుట యసంబవముగాదు. వారితో నార్యులకు సంపర్కము కలిగి యుండును.

కాల్డ్వెల్, గండర్ట్, కిట్టెల్, మున్నగువారు ద్రావిడభాషలనుండి యార్యభాష లెరవుతీసికొన్న పదముల పట్టికల నిచ్చియున్నారు. ఇండో-యూరోపియను భాషలలో సమానపదములులేని యార్య భాషలలోని దేశీయ పదములన్నియు ద్రావిడపదములై యుండును. కొన్ని కోల్‌ భాషాపదములునై యుండును. కొన్ని ద్రావిడ, కోల్‌భాషలకు పూర్వదేశమందుండిన భాషలలోని పదములునునై యుండును."

కాల్డ్వెల్‌పండితుడు ద్రావిడభాషలకును నిండో-యూరోపియను భాషలకును గల సంబంధమును గూర్చి విపులముగ జర్చించి యా రెండు కుటుంబములకును నెట్టిసంబంధమును లేదనియు సిథియను భాషలతోడనే ద్రావిడభాషల కెక్కువసంబంధ మున్నదనియు నిర్ధారణము చేసెను. తనకు