పుట:Andhra bhasha charitramu part 1.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదాహరణములు:- బంగాలీ: ఘోరాటోరో; మైథిలీ: ఘోరా-తోరా; హిందోస్థానీ: ఘోఱా-ఉఱా; గుజరాతీ: ఘోఱో-బోకో; మరాఠీ: ఘోఱా-బీఱా; సింహళీ: అశ్వయా-బశ్వయా; తమిళము: కుదిరెయ్-కిదిరెయ్; కన్నడము: కుదిరె-గిదిరె; తెలుగు:గుఱ్ఱము-గిఱ్ఱము.

ఇట్టి రూపములకును గుడ్డ-గుడును; పెట్టె-పేడ; కుండ-మండ; మొదలగు సమాసములకును భేదమున్నది. ఇట్టి సమాసములలో రెండవ మాట మొదటి పదమునర్థమునే కలిగిన ప్రాచీనపుమాట; మీద దెలిపిన వానిలో రెండవపద మర్థరహితము. ఇట్టి సమాసము లాధుని కార్యభాషల యందును గలవు.

ఉదాహరణములు:- కాపఱ్-చోపఱ్; చాఱీ-బాఱీ; మొ.

III. వాక్యనిర్మాణము.

ఉచ్చారణ, శబ్దనిర్మాణములకంటె, వాక్యనిర్మాణము భాషల సంబంధమును నిర్ణయించుట కెక్కువగ నుపయోగించును. వాక్యనిర్మాణ విధానము పరంపరాగతమై, చాలవఱకు మాఱక యుండును. క్రొత్తయుచ్చారణమును, శబ్దములందలి మార్పులును నితర భాషాసంపర్కము వలన సులభముగ గలుగ వచ్చును. వాక్యనిర్మాణవిషయమున ఆధునిక ఇండో-ఆర్యభాషలును ద్రావిడ భాషలును నైక్యమును వహించియున్నవి. శబ్దముల క్రమమును మార్చకుండ పదములకు పదములనుంచి తమిళువాక్యమును బంగాళీవాక్యముగనో, హిందీ వాక్యముగనో మార్చవచ్చును. కాని, పెర్షియను, ఇంగ్లీషువాక్యముల నట్లు మార్ప వీలులేదు. ఈ వాక్యనిర్మాణమునందలి యైక్య మీరెండు కుటుంబములకును బ్రాకృతముల కాలమునుండియు గలుగుచువచ్చినది. పాలి ప్రాకృతభాషల వాక్యనిర్మాణమును గమనించినయెడల నీవిషయము బోధపడగలదు. ఈ రెండు కుటుంబముల వాక్యములందును మొదట విశేషణములతోడి కర్తయును, తరువాత విశేషణములతోడి కర్మమును, పిదప క్రియార్థమును వివరించు పదములును, దుదను సంపూర్ణ క్రియా పదమును వచ్చును.

రెండు కుటుంబములందును కర్తృకర్మములను గలుపు అస్త్యర్థక ధాతువు లేకుండును.

ఉదాహరణము:- బంగాళీ: ఏ-టా ఆమాదేర్ బాఱీ; కన్నడము: ఇదు నమ్మమనె; తమిళము: ఇదు ఎంగలుడైయ వీడు; తెలుగు: ఇది మాఇల్లు; బంగాళీ: మానుష్-టీ భాల; తమిళము: మనిదన్ నల్లవన్;