పుట:Andhra bhasha charitramu part 1.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇండోయూరోపియను భాషలలో స్వీడిషుభాషయందు రేఫదకారముల సంయోగమున డకారమేర్పడినది. ఇట్టి మూర్ధన్యీకరణమే ప్రాచీనమాగధీ భాషయందునుగలదు, మాగధియందు రేఫమునుండి లకారమును, రేఫదంత్యాక్షర సంయోగమువలన మూర్ధన్యధ్వనియు గలుగుచుండెను. రేఫము లకారముగ మాఱి దానితో దంత్యవర్గీయహల్లు చేరి, మూర్థన్యవర్గీయ హల్లుగా బ్రాచీన ఇండో-ఆర్యభాషలలో సహజముగనే మాఱి యుండును. ఇట్లే ఇండో-ఆర్యభాషలలో మూర్ధన్యాక్షరములు సహజముగ బ్రాచీనకాలము నుండియు నుత్పత్తియగుచుండుట కుదాహరణములు గాన వచ్చును. రెండచ్చుల నడుమనుండు డ,ఢ, లను టి, టి, లుగ నాధుని కార్యభాషల యందును బ్రాకృత భాషలయందును ద్రావిడ భాషయందు వలెనే కాననగును.

4. ద్రావిడభాషలయందువలెనే యాధునికార్యభాషలందును బ్రాకృతభాషలందును స్వరభక్తి, లేక విప్రకర్షముచేత సంయుక్తాక్షరములు విడబడుట సంభవించెను.

ఉదాహరణములు:- ప్రాకృతము-కిలేశ (క్లేశ); సినేహ (స్నేహ); హరిస (హర్ష); రతన (రత్న); సుమిణ (స్మరణ); పరాణ (ప్రాణ); బరామ్హణ (బ్రాహ్మణ); మొ.

తమిళము- పిరామ్మణన్ (బ్రాహ్మణ); శినేగమ్ (స్నేహం); మిత్తిరన్ (మిత్రమ్); తిరు (శ్రీ); కిరుట్టినన్ (కృష్ణ); శందిరన్ (చంద్ర); మొ.

ద్రావిడభాషలలో బదాదియందు సంయుక్తాక్షరము లుండవనియు, బదమధ్యమందు ద్విత్వాక్షరములుండుననియు, నీలక్షణము ప్రాకృతభాషలకు ద్రావిడమునుండి కలిగినదని సాధారణముగా నొకయభిప్రాయము గలదు. కాని యతిప్రాచీనకాలమున ననగా గ్రీస్తుపూర్వము చాలశతాబ్దముల క్రిందట నిండో-ఆర్యభాషలయందువలె ద్రావిడమునందును త్ర, ద్ర, వంటి సంయుక్తాక్షరము లుండెననియు పదాదియందు ద్ర యను సంయుక్తాక్షరమును గలిగిన ద్రమిడ, ద్రవిడ శబ్దములు ప్రాచీన ద్రావిడశబ్దములే యనియు నా శబ్దములనుండి తమిఱ్ అనుపదము దమిఱ అనుపదము ద్వారా తమిళభాషలో గ్రీస్తుతఱువాత గలిగినదనియు దమిఱశబ్దమును పాలి, ప్రాచీన సింహళభాషలు దమిళ యను రూపముతో నెరవు తీసికొనినవనియు, నిట్లే దమిఱకం అనుపదము గ్రీకుభాషలో దమిరికేయనియు, లాటిన్‌భాషలో దమిరిచెయనియు వ్రాయబడెననియు బ్లాకు పండితు డభిప్రాయపడి యున్నాడు. కావున సంయుక్తాక్షరములు విడబడుట ఇండో-ఆర్య భాషలయందును ద్రావిడభాషలయందును నొక్కటేవిధముగ గలిగి