పుట:Andhra bhasha charitramu part 1.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోవు మున్నగు పండితు లాతనియుహ సరికాదని యాక్షేపించి యుండిరి. కాల్డ్‌వెల్‌గారి సిద్ధాంతము పరిశోధక లోకము నందుకొలది కాలము క్రిందటి వఱకును ప్రమాణముగ దలంపబడు చుండెను. కాని యిటీవల నాతనిసిద్ధాంతము విషయమై వివిధాభిప్రాయములు వెలువడినవి. ఈ విషయమై గ్రియర్‌సన్ పండితుడిట్లు వ్రాయుచున్నాడు. - "సిధియనుపద మంతసమంజసముగ లేదు. గ్రీకుగ్రంధకర్తల గ్రంధములలో గనబడు సిథియనుపదములు స్పష్టముగ నై రేనియను భాషలలోనివి, అనగా నవి ఇండోయూరోపియను కుటుంబమునకు జెందినవి. అయినను నాపద మాసియా యూరోపుఖండములలోని ఇండోయూరోపియను సెమిటికు కుటుంబములకు జెందనిభాషల కన్నిటికిని సామాన్యమగు పదముగ నుపయోగింపబడినది. ఇదిగాక యీభాషల నేవిధమునను నేక భాషాకుటుంబము లోనికి జేర్ప వీలులేదు. చీనాదేశము తత్ప్రాంతదేశములలోని యేకమాత్రాకములగు భాష లిండో-యూరోపియను కుటుంబమునుండి యెంత భేధించు చున్నవో, కాకసన్ ప్రాంతములందలి ఫిన్నులు, మాగ్యారులు మాట్లాడుభాషలనుండియు నంత భేధించుచున్నవి. ఆ భాషలయందు కాన్పించు సామాన్యలక్షణములు సాధారణముగ నన్ని భాషలయందును గాన్పించునవియే. వీని సామాన్యలక్షణములకంటె వీని యందుగల మహత్తరములగు మూలలక్షణములందలి భేదములే యెక్కువగ నున్నవి. ద్రావిడభాషల నిండియాదేశమునకు వెలుపలనున్న భాషాకుటుంబములతో గలుపుటకు జేసినప్రయత్నములు విఫలములయ్యెనని సాధారణముగ దలంపబడుచున్నది. కావున మనము వానిని ప్రత్యేకభాషా కుటుంబముగనే యెంచవలెను. ముండాభాషలతో ద్రావిడభాషలకు సంబంధమున్నట్లు పైకి కనబడును గాని యట్టిసంబంధములేదు. ఇండోయూరోపియను కుటుంబముతో దగ్గఱ సంబంధమును జూపుటకు జేసినప్రయత్నములుగూడ నట్లే విఫలములయినవి. ఇటీవల ద్రావిడభాషాకుటుంబమునకును బర్మాదేశమునందలి ఛిన్నులభాషకును గల సంబంధమునుగూర్చి యొకరు ముచ్చటించిరి గాని యా వాచము పండితులదృష్టి నాకర్షించినట్లు కనబడదు. ఆస్ట్రేలియా భాషలకును ద్రావిడభాషలకును సంబంధమున్నదని ఫ్రీడ్రికు మిల్లరుగారు ప్రతిపాదించిరిగాని యది సమర్థింపబడినదని యూహింపవీలులేదు" అని.

ద్రావిడభాషలకును నితరభాషా కుటుంబములకును గల సంబంధము గూర్చి కాల్డ్‌వెల్ చర్చించినంత విపులముగ మఱియెవ్వరును జర్చించియుండ లేదు. ఆతడు ద్రావిడమునకును నిండో-యూరోపియను భాషలకును గల సంబంధమును గుర్తించియుండకపోలేదు. కాని యాసంబంధము చాల ప్రాచీనమైనదనియు, ఆర్యభాషలతోడి సంబంధముకంటె సిథియనుభాషలతోడిసంబం