పుట:Andhra Patrika 1928 Vibhava Issue ఆంధ్రపత్రిక విభవ ఉగాది సంచిక 1928.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72


విభవ ప్రశంస

శ్రీ. లక్ష్మీపతి శాస్త్రి గారు

విభవసంప్రాప్తి గలిగెడు విధము దెలుప
బ్రభన వేళ నె మనలోనఁ బ్రభన మయ్యె
జాతిసమ్మేళనాసక్తి, జన్మభూమి
దాస్యమోచన కాంత, స్వాతంత్ర్యవాంఛ
విభవ మారంభ మయ్యెనో విబుధులార!
ప్రభన వేళను గలిగిన పట్టు వికక
జన్మఫలమైన స్వాతంత్ర్య సత్ఫలంబు
పడయుఁ డన్యు మాయల పాలుగాక.


ఫలము

విభవఫలమును జెప్పెద వినుఁడు విధిగా
భరతఖండంబు సర్వార్థ భరిత మగును
సర్వజాతులవారికి సఖ్య మగును
బరుల సామగ్రి భరత భూబాహ్య మగును
దాస్య బుధంబు తెగిపోవుం దనకుఁ దానె
తోడిదేశాల వారలతోడఁ గూడి
సరిసమానముగా నుండు శక్తి గలుగు
భరతఖండము పూర్వపు భాగ్య మొందు
దైనయత్నము సమకూడె దానికోడ
బురుషయత్నము గాన లెఁ బూర్ణ దీక్ష
యత్న మొనరింప విధవ సంప్రాప్తి యగును
విభవవేళల విధనా స్త్రీ మిక యగునె?