పుట:Andhra Pandita Bhishakkula Bhasa Bhesajam, Midhyapavadamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాషాభేషజము

౨౧౧

________________

విరుష్టమయిన శబ్దములు పుట్టించే వారికి వ్యాకరణ మంటే ఏమిటో తెలియ దని చెప్పవలెను. ఆగమ శాస్త్రము నిత్యముకాదు. ఉత్సర్గము కంటె అపవాదము బలీయము.అపవాదము లున్నప్పడు వాటిని చెప్పకుంటే, శాస్త్ర మప్రమాణము గాని శబ్దము తప్పుకాదు. వ్యాకరణ శాస్త్రముయొక్క పడికల్లు తెలియని పండిత బ్రువులు లోకములో ప్రసిద్ధ మయిన శబ్దములు శాస్త్ర విరుద్ధములని దూషించి, లోక విరుద్ధమయినవి శాస్త్రముచేత సాధింప నెంచి స్వభావసిద్ధమయిన రూపములుమార్చి 'దిద్దుతున్నారు'. తమ బొల్లి భాష బడిపిల్లలకు నేర్పుతున్నారు. 'ఆనందవాచక పుస్తకముల'లో కూడా 'ముందునకున్ను' అట్టివే ఇంకా అనేక అపశబ్దములున్ను ఉన్నవి. మన శ్రాస్తులవారు,వాడినవే ఇట్టి అపభ్రంశములు ఈవ్యాసము మూడవ భాగములో ఉదాహరిస్తాము.

ఆంధ్రపత్రిక ముద్రాలయమున ముద్రితము, చెన్న పురి. 1933