Jump to content

పుట:Andhra Pandita Bhishakkula Bhasa Bhesajam, Midhyapavadamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిథ్యాపవాదము


ప్రస్తావన

ఈవ్యాసమునకు పీఠిక వ్రాయనారంభించినప్పుడు నామిత్రులిద్దరు నన్ను చూడవచ్చి, దీనిలోని విషయమును గురించి ప్రసంగించినారు. ఆప్ర సంగమే ప్రస్తావనగా రచించి చేర్చినాను.

నాయుడుగారు - మేము వచ్చినపనిఅయినది; గాని మీపనికి ఆటంక మైనది; ఏదో వ్రాస్తున్నారు - రేపు మళ్లీ వస్తాము.

నేను - చిన్న వ్యాసమొకటి -
నా - దేన్ని గురించి?
ఆచార్లు గారు - విషయమేమిటండి?

నేను - మిథ్యాపవాదము — కూర్చునివినండి, చెప్తాను - మీరు విన్నారోలేదో? — దుష్టప్రబంధనిర్మాతలట! భాషాదేవికట! విషప్ర యోగముచేసినారట! విషముశీల్యములోనికి దిగినదట! దేవిగారు ప్రాణ సంశయదళలో ఉన్నారట! వెంటనే తగినచికిత్స చేయకపోతే -

ఆ—(చెవులు మూసుకొని) కృష్ణకృష్ణ! ఏమిటో అవాచ్యము! ఎవ రావిషప్రయోగముచేసిన పాపాత్ములు?

నేను - దుష్టప్రబంధ నిర్మాతలని చెప్పినానే.
ఆ - ఎవ రాపాపిష్ఠదుష్టప్రబంధనిర్మాతలు?

నేను — అనేకులట. వారికి ప్రతినిధులు, ప్రధానులు,కీర్తిశేషు లయిన రావుబదహరు కందుకూరి వీరేశలింగం పంతులుగారట!