ప్రాతిపదిక
11
కాశమూ సామర్ధ్యమూ లేకపోవడం చేతనో, ఉదాహరణగా నేను తీసుగున్నవి నాటకపు పద్యాలవడంచేతనో, నా వాదన ఎంత సహేతు కంగా కనిపిస్తేంగనక మరీ దారుణంగా కనుపిస్తూన్న సారాంశం ఒప్పు గోడం ఎట్లా అని కొంతమందికి లోపల బాధ బయల్దేరడంచేతనో, నా వాదనని ఏదో మోస్తరుగా నా సమక్షంలో మార్దవంగానూ, నా పరోక్షంలో కొంచెం ఊతంగానూ - కొట్టిపారేసేవిమర్శకులు ఉంటో చ్చారు. అప్పుడు పుట్టిన కొన్ని చిట్టిపొట్టి విమర్శనలూ, నా సమా ధానాలూ ఈ క్రింది విధంగా ఉండేవి :
1. నాకు సంగీతం రాకపోవడంవల్ల ఈ పేచీ బయల్దేర తీశా నని.
సమాధానం :- నాకు చాలా రావు. బహుశ అందులో సంగీతం ఒకటి. నాకు రానివన్నీ ప్రపంచంలో ఉండకూడ నివి అని నేను అనలేదు. కాని, ఒక చిత్రం ఏమిటంటే, నన్ను సంగీత విషయంలో అల్లా ఆక్షేపించినవాళ్లు నే పాడినపాటి రాగమూకూడా పాడలేనివాళ్ళు !
2. నేను నాటకసంగీతం మీద దండెత్తా నని.
సమాధానం:- అదేముటో తెలియక దండెత్తాను. అది సంగీ తమే అని గాయకులంటే, శిరసావహిస్తాను.
కి. నేను గద్యనాటకాలే ఉండాలని అంటా నని.
సమాధానం :- నేను అనను. ఆ మాట గురువులైన శ్రీ శ్రీపాద కామేశ్వరరావుగారిది.
4. మంచిగొంతిగవాళ్ళని చూస్తే నాకు ఈర్ష్య, అని.
నమాధానం :- మంచిగాత్రం వాళ్ళకి మొక్కి వాళ్లపాట వింటాను. ఆ గాత్రంతో వాళ్లు ఏంజేసినా నాకు ఆనందమే.