పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాతి పదిక 5 “ఆగండా కూడా ఎదేనా తగిలించనియ్యవయ్యా ' అనేవారు, శ్రీ వెంకటశాస్త్రి గారు. పద్య, రాగ, అభినయాల మూడింటికీ సమ్మేళన అస్యశ్వం ఒప్పించడానికి వచ్చిన నటుడిపట్ల అసంభవం అని నేను ఉదాహరించి మాట్టాడుతూండే వాణ్ణి. శ్రీ కాళీ కృష్ణాచార్యులుగారు, ఎప్పుడేనా కలగ జేసుగుంటూండి, నేను సుగమం చెయ్య లేక పోయిన భావాన్ని తమరు సుగమం చెయ్యడమే కాకుండా దాన్ని అలంకరించికుడా వెలు వరిస్తూండేవారు. ఒకసారి, ఆయన వెంకటశాస్త్రిగారితో, గండి, శాస్తులుగారు ! అది కాదు కామేశ్వర రావుగారు చెప్పేది. ప్రౌఢ రాగకన్య వెళ్ళి పద్యపురుషుణ్ణి కౌగిలించుకోగానే, పద్యపురుషుడు గతి చెడడ మే కాదు, మూర్ఛలోనే పడిపో తాడు, అంటున్నారు ' - అని సెలవిచ్చారు. అప్పటికి (అప్పణించి ఇప్పటిదాకా కుడా) పెన్న లుతో కాగితాలమీద రాసిఉన్న నా రచన, ఉన్న పాళంగా అప్పట్లో ఇచ్చేస్తే ఒక నూటయాభై రూపాయలు పారితోషికం ఇస్తానని ' శారద ' పత్రికాధిపతులు శ్రీ కౌతా శ్రీ రామశాస్త్రి గారు అన్నారు. వారితో నేను, ' అయ్యా ! ఇది నా మొదటిరచన. ఉద్రేకంలో ఏదో అనేస్తూ, మరిచిపోతానేమో అని ఆపళంగానే కాగితంమీద పారే శాను. నాకు తెలుగు తెలియదు, ఎక్కడా నేర్చలేదు, మొదటిసారి అచ్చుపడడమూ, విషయం తగాదావిషయమూ అంటే నాకు భయంగా ఉంది. పైగా, నేనూ రాగ వేషం వేసిన వాళ్లే గనక, ఈ అభిప్రాయాలు మరి కొన్నేళ్ళుపో తే నాకే నచ్చుతాయో నచ్చవో, ఈ ఉడికీఉడకని పాఠం జనానికి వడ్డించే విషయంలో నేను మె పడడంకంటె, నేనే సెట్టు గోడం నాకు శ్రేయస్కరం. మీరు నా రచనకి విలవకట్టినందుకు కృత జుణ్ణి ' అన్నాను. అని రచన ఉంచేసుగున్నాను. [ బందరుసభల విశేషాలు నాకు సంబంధించినవి కొన్ని చెప్పు గుంటూ ఉండేవారు. ఓం ప్రధమంలోనే నేను భైరవిరాగం ప్రారం