పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4 ఆంధ్ర నాటక పద్య పఠనం శా అదివరకెప్పుడూ నేను జనంఎవట నిలబడ లేదు, ప్రసంగించ లేదు. కాని, అవసరాన్ని పురస్కరించుగుని అల్పుడుకుడా ఏదో అల్ల రి చెయ్యగలిగే అదను కలుగుతూంటుంది, అందుకని, శాస్త్రం చెప్పిన తరవాబుగా, కొంత ఆట కొంత పాట కొంత మాట లాంటివి ఏకంచేసి ధప్పళ పద్ధతిలో ఏవో నేను దంచెయ్యడం జరిగింది. అక్కడికి వెళ్ళడానికి పూర్వమే, నాలో దీన్ని గురించి బయల్దేరిన ఆందోళన నా దగ్గిర లిఖతం అయేఉండి ఉంది. నాటకం, కవనం, పద్యం, గానం, రాగం, కీర్తన, అభినయం మొదలైన పదాలు ఇదమిత్థం అనుకుని ప్రసంగించడమూ, నాకు చేతనయినంతమట్టుకు దృష్టాంతాలు ఇస్తూండ డమూ. తయారుచేసుగుని వెళ్ళిన ద స్తరం అప్పుడప్పుడు చెప్పి, అదంతా చదవడం మొద లెడ తానేమో అనే భయం సభ్యులముఖాల్లో కనపడ గానే ద స్తరం కట్టేసి ఏ రాగమో అందుకుంటూండడమూ - ఇల్లాగా రెండు రోజులపాటు - బందరు పౌరుల అంతఃకరణ ధర్మమా అని - కౌల క్షే వం అనండి, భజన అనండి, నేను జరిపాను. వాదనలో : పద్యం పఠించాలి అనే నే నొక్కణే ఒక పక్షం. తటస్థంగా వింటూన్న ఏ అయిదారుగురో తప్ప తక్కిన అందరూ ' పద్యం రాగించాలి, లేక పోతే ఏడిసినట్టుంటుంది " అనే రెండో పక్షం. నేను తేల్చే సారాంశం చెవికి ఎంత చేదైనా, అంతా నన్ను మన్నించా రేకాని, నిరసించ లేదు. రాగవిషయంలో నేను చెబుతూండేవి సత్యమే అని నిలబెట్టడానికి శ్రీహరి నాగభూషణముగారూ, పద్యవిషయంలో నేను అనేవి యథార్థం అని నిర్ణయించడానికి శ్రీ చెళ్ళళ్ళ వెంకటశాస్త్రి గారూ, అభినయ విషయంలో నేను మాట్లాడేవి రూఢి అని పరిష్కరించడానికి శ్రీ వెదురుమూడి శేషగిరిరావుగారూ అవసరం వచ్చినప్పుడు అడ్డుపడి నామాట దక్కిస్తూ ఉండే వారు. ఒక్కొ క్కప్పుడు నే చెప్పిందీ పొడిందీ నిని, 'నువు చెప్పేదంతా బాగానే ఉంది. పద్యానికి కాస్త రాగం