Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథాలయ సూక్తులు

గ్రంథములు పెక్కు తనచెంతఁ గలిగియుండి
అనయమును వాని చదువని యట్టివాఁడు,
దివ్వె కరమున ధరియించి తిరుగు గ్రుడ్డి
వానివిధమున పరిహాసపాత్రుఁ డగును.

మంచిగ్రంథము జదువఁ గాంక్షించువాఁడు
కోరఁ డా ప్తుల హితులను కూర్మిసఖుల;
దినదినంబును హితము బోధించుచుండు

పుస్తకంబులె తన కూర్మి నేస్తగాండ్రు.

గ్రంథాలయములు


ఆలయంబులఁ బోలె గ్రంథాలయముల
విమలభ క్తిని జనులు సేవింపవలయు;
ఎందు వెదకిన నందని యీశ్వరుండు
కాపురము సేయు నిరతంబు కావ్యవాటి.

తనువు ర క్తము జీవంబు ధారవోసి,
ఋషివతంసులు పెక్కు వేలేండ్ల తపము
సలిపి ఆర్జించినట్టి విజ్ఞానధనము
దాచియుంచిన పేటి గ్రంథాలయంబు;

పాటకజనంబు పెంపొందవలయు నన్న
మేలి సాధన ముచిత గ్రంథాలయంబు,
ప్రవిమలం బగు సద్గ్రంథపఠనవాంఛ
తుచ్ఛవాంఛల నెల్లను తొలఁగఁద్రోలు,

గాలి నీరును లేకున్న గడపవచ్చు,
గ్రాసమును లేక ఎట్టెటో గడపవచ్చు;
గడపవచ్చునె మన మొక్క గడియ యైన
గ్రంథభాండారములు లేని గ్రామమందు?

గ్రంథనిలయంబు గల నరకంబునందు
నైన నివసింపఁ గాంక్షింతుఁ గాని, నేను