జన విద్యాప్రచార కార్యక్రమమున గ్రంథాలయముల నిర్మాణమునకు బాగుగ తావొసగినవి. వయోజనవిద్యకు గ్రంథాలయములకు గల అవినాభావసంబంధ మునుబట్టియే మొదటినుండియు మాపత్రికలో గ్రంథాలయ విషయములతోపాటు వయోజన విద్యకు సంబంధించిన సంగతులనుకూడ చేర్చి ప్రకటించుచున్నాము. ఈ విషయమై కృషి చేయు వారెవ్వరైనను వ్యాసములనుగాని, వార్తలనుగాని మాకు పంపుచో సంతోషముగ స్వీకరింతుము. వీనిని మాపత్రికలో ప్రకటించుటకు బ్రయత్నింతుము. ప్రస్తుత మీ యుద్యమమున కండగ నుండు పత్రిక ప్రత్యేకముగ లేని కొరతను దీర్చు సంకల్పము మాకు గలదు. కాన వయోజన విద్యావ్యా ప్తిని వాంఛించు వారెల్లరు ఈపత్రిక నాదరింతురని యెంచెదము.
గ్రంథ సమీక్షలు
గ్రంధాలయముల నిర్వాహకులు తమతమ గ్రంథాలయములకు పుస్తకముల కొనవలసి వచ్చినపుడు ఏగ్రంధములు కొనదగనిలో ఏవికొనదగినవో తెలియక ఇబ్బంది పడుటయు, ఆలోచనలేక సంపాదించిన గ్రంధములవలన గ్రంధాలయా దర్శము సరిగ నెర వేరకపోవుటయు పరిపాటిగా నున్నది. ఈ యిబ్బందులు కలుగ కుండ నుండుటకై వేరు వేరు విషయములనుగూర్చి పరిశోధన చేసిగాని, మఱొక విధముగగాని దెలిసికొన్న వారిచే ఆయా విషయములకు సంబంధించిన గ్రంధపట్టీల తయారు చేయించ వలసిన విధి ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముపై గలదు. దీనికి నిపుణుల సాహాయ్యమవసరము. ఇవిగాక తెలుగునను ఆంగ్లమునను నిత్యము వెలువడు సద్గ్రంధములపై విమర్శనములుకూడ ఎప్పటికప్పుడు వెలువడుచో గ్రంధ భాండాగారులు వీనిని చదువుకొని తమకుపయు కముగ నుండు గ్రంథముల వీని ఆధారముపై నెన్ను కొనుటకు వీలుకలుగును. కనుక గ్రంధకర్తలును, గ్రంధ ప్రకాశకులును తమనూతన ప్రచురములు నెప్పటికప్పుడు మాకు బంపుచో వానికి సమర్థులైనవారిచే సమీక్షలు వ్రాయించి మా పత్రికలో బ్రచురపఱతుము.
కృతజ్ఞత
ఇంతదనుక నీపత్రికానిర్వహణ విషయములో మాకు సాయపడిన సంపాదకు లకు, వ్యాసకర్తలకు, విమర్శకులకు, ముద్రాపకులకు, చందాదారులకు మే మెంతయు కృతజ్ఞులము. మాపత్రిక నాశీర్వదించుచు తమ అభిప్రాయముల కోరి నంతనే వ్రాసి పంపిన పెద్దలకు మా వందనములు. వీరందఱి తోడ్పాటును మాకు లభింపజేసిన సర్వేశ్వరునికి మా ప్రణామములు అభిమానుల సహాయము, పెద్దల ఆశీర్వచనములు ముందు కాలములో కూడ మాకు కొల్లలుగ లభింపజేసి మా పత్రిక చిరకాలము నిర్విఘ్నముగ కొనసాగున ట్లను గ్రహించుటకై పరమాత్ముని మఱి యొకసారి ప్రార్థింతుము.