సభ్యుల వివరములు
సంఘనిర్మాణము
సంఘకార్యక్రమము కట్టుదిట్టముగ నడచుటకై దీని నిర్మాణములో ఈ రెండు సంవత్సరములనుండియు అప్పుడప్పుడు మార్పులు చేయబడుచు వచ్చెను. దేశము నలుమూలల ఈ సంఘోద్దేశము నమలుపరచుటకై బయలుదేరిన నగర, తాలూకా, జిల్లా గ్రంథాలయ సంఘములు కేంద్రసంఘముతో సహా ఒకేసూత్రముపై నడచు టెటులాయని పలుమారులు చర్చించి ఇటీవలనే ఇందువిషయమై ముఖ్యతీర్మాన మొకటి చేయబడెను. దీని ననుసరించి కేంద్ర సంఘమున సభ్యులుగ జేరు వ్యక్తులును, సంస్థలును వేరు రుసుములు చెల్లించకుండగనే దీని శాఖా సంఘములుగనేర్పడు జిల్లా, తాలూకా లేక నగర సంఘసభ్యులు కూడ నుందురు. ఈసంఘము లన్నియు తమ తమ ధర్మములను క్రమముగ నిర్వర్తించుచు పరస్పర సహకార సహాయములతో నడుపబడుటచే వీని కార్యక్రమమున కేలాటిలోటుగాని సంభవించదు. ఈ నిర్మాణవివరము నిచట ప్రస్తావించను. దీనినిగూర్చి విపులముగ తెలియగోరువారు ఆంధ్రగ్రంధాలయం ౧వ సంపుటము ౨ వ సంచికలో 174,175 పేజీలలో చూడవచ్చును.
వ్రచారము
సంఘసభ్యులును, తదితర మిత్రులును వ్యక్తిగతముగ నీ యుద్యమప్రచారము విషయమై తీసికొన్న శ్రద్ధను గూర్చిన వివరములు మేము సేకరించియుండ లేదు. ఈ సంఘపక్షమున నేరుగ ఏర్పాటు చేయబడిన ప్రచారక, వైజ్ఞానికోపన్యాసములు గాని గ్రంధాలయ ప్రదర్శనములు గాని రెండు మూటికన్న లేవు. పై రెండేండ్లలో ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ ఒక్కటికూడ జరుగలేదు, పశ్చిమ గోదావరి,