Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేదు ; జాతిభేదమును చర్చింపము; పార్టీభేదమును పాటింపము; గొప్ప కొద్ది గొడవ కొండాడము; హక్కుకై కక్కుర్తిపడము; బాధ్యత ఎఱిఁగి పాటుపడుదుము. ఇట్టి కట్టడలతో పనిచేయు కొఱవరుల కోరికలు తీర్పకున్నను, తీర్పమని ఎవరనఁగలరు? ఎన్నాళ్ళు తీర్పకుండఁగలరు?

కాన, మేలుజేయు తలంపుతో ఎల్లఱోనినమ్మి పాటుపడుదుముగాక! అన్నికడంకల విత్తనములును పొ.గు. కడంకలో ఇమిడియున్నవని తోడివారికి తెలిపి దానికొఱకు పాటుపడి వారికి మేలు చేగూర్తుముగాక! అందఱమును కలసి, తెనుఁగుపలుకు తల్లిని తెనుఁగునాటి తల్లిని గద్దె ఎక్కింతుము గాక !

ఆంధ్రదేశ గ్రంధాలయసంఘ మేర్పడినపుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారితో పాటు కార్యదర్శిగా ఉండి ౧౮౯౮ లో గ్రంథాలయమొకటి స్థాపించి, దానిని నానాఁటికి తెనుఁగు నాట పెద్ద గ్రంధాలయమనిపించుకొనునట్లు గౌతమీ గ్రంథాలయముగా పెంపొందించిన శ్రీమధురకవి నాళము కృష్ణారావుగారి షష్టిపూర్తి మహోత్సవసమయమున ఆయన చేసిన గ్రంధాలయ సేవను గుర్థించి గుర్త్తించి గౌరవించుటకు ౨౨ అం.దే.గం. మహాసభ మన వేంకటరమణయ్య గారి ప్రోత్సాహమున-ఇచ్చట జరుపఁగలిగినందులకు మన మెంతయు సంతసింపవలయును. శ్రీకృష్ణారావుగారు మనకు చేసిన ఆదరణమునకు మనము వారికి ఎంతయు కృతజ్ఞులము; తక్కిన మానవసేవతోపాటు మనకు తోడుగా ఉండి గ్రంథాలయ సేవ చేయుటకు పరాత్పరుడు వారికి చిరాయురారోగ్యైశ్వర్యము లొసంగుఁగాక!

నేనిందు తెలిపిన తెలలు పెక్కులు పెక్కురవ్రాతలుచదివి, కైకొంటిని. ఆవ్రాఁతకారులకు ఎల్లఁడు మేలు కూర్చుఁగాక!

మంది తామెల్లయేడల నెమ్మదిగ మనుత!
నేలఏలుతఁ పొడియై నేలఱో౦డ్లు!
ఆలుఁపాఱులుఁ ఎప్పుడు౯ మేలుకనుత!
ఎలజగములకు౯ హాయిఎసఁగుఁగాక!

మారేపల్లి రామచంద్రశాస్త్రి