Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోనే కాక-పై నాడులలో కూడ, ఎక్కినది. ఈయన ప్రోవువలస పొ.గు. కడంక మొక్క తెనుఁగునాట వేరునాటి, పాదుకొనినవి; అందుచేతనే, అనకాపల్లిలో శ్రీ శారదా గ్రంధాలయవార్షి కోత్సవసభకు అధ్యక్షతవహించిన కవిసార్వభౌమ బ్రహ్మశ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారిచే నిరుడు “ఆంధ్రులు మొదలు పెట్టిన ఉద్యమములలో స్థిరపడి-పనిచేయుచున్నది గ్రంధాలయోద్యమమే” అని మెప్పు పొందఁగలిగినది. ఇట్లు మన పొ.గు.కడంక నిలుచుటకు కారణము ఎల్లని కనికరమో, మొదలు పెట్టినవారి పేర్లబలిమియో, పనిచేయుచున్నవారి స్వార్థత్యాగపుపనియో. కావలె; ఏదో ఒకటియే అని నేల? అన్నియుని తలఁపనగు. మనవారు కొందఱనుకోనునట్లు తెనుఁగువారికి అచ్చిరాని 'ఆంధ్ర' పదము మన ఉద్యమనామమున చేరకపోవుటయు కారణమగుఁగాక! కాకపోవుఁగాక! ఎటులైన నేమి? మన ఉద్యమము మననాట పాదుకొనుటయేకాక, కొంతఫలించి, నైనాడులలో కూడ తన విత్తనములు మొలకలెత్త, చెన్న రాష్ట్రశాసనసభలో పొ.గు.బిల్లుకూడ వచ్చునట్లు చేయగలిగినది.

కానీ, తెనుఁగుతనము-ఆంధ్రత్వము—నిలువఁబెట్టుటయు మన ఉద్యమములోనిదే! అనిమీరు చెప్పఁబోవుచున్నారా! అందురా? అవును; అదే చెప్పఁబోవుచున్నాను. కాని, ఆవులించిన ప్రేగులుకఁ బెట్టఁగల మీరు నాకట్టి అవకాశమిచ్చెదరా? నేను చెప్పకముందే మీరే అది చెప్పి చేసినారు. అటు నేను చెప్పఁదలంచుటకు కారణము చెప్పవలెఁగదా! ఆలకింపుడు. నిజమునకు, తెనుఁగు నాట పెద్దరికము చేయవచ్చు వారందఱుకు తెనుఁగుతనము నిలుపుటకేకాక, పెంపొందించుటకు కూడ పూనుకొనవలసినవారే. కాని, వారటుచేయుటలేదు. కాంగ్రెస్సు పెద్దలదృష్టి స్వర్గమున నున్న స్వరాజ్యముమీఁదికే కాని, నేలమీఁదనున్న తెనుఁగుతనముమీఁదికి దిగుటయేలేదు. జస్టిస్ పార్టీ వారి చూపా? ఉద్యోగముల పైకి ఎప్పుడును పోవునుగాని దీని పైకివచ్చుటలేదు. ఇంక, ఆంధ్రమహాసభవారు, ఎప్పుడోఎట్లో ఎచ్చటనో సభ అయినపుడే కానవత్తురు; ఆడికాఁగానే ఎవరియిండ్లకువారు పోదురు; ఎవరిపనివారు చూచుకొందురు. ఆంధ్రమాతకు జే! ఆనాఁటితో నేసరి! తీర్మానముల కాగితములయినను మరల దొరకుట అరిది. సభలరికార్డు ఎక్కడనున్నది? అనిన చెప్పువారెరు ? ఇట్టిస్థితిలో వారేమి చేయుదురు? మఱి మిగిలిపోయిన వారెవరు? తెనుగునాటి పీఠాధిపతులు, వారికి బిక్షలపని, మోక్షపుపని మొదలగు ఎన్నో పనులు కలవు; కాన, వారికి తీఱిక ఎక్కడ? ఉన్నను, ఐహిక విషయములతో మాకు పనిలేదందురేమో! అనుకొంటిని. అందుచేత, ప్రారంభోత్సవములకో, వార్షికోత్సవములతో, తాలూకుసభలకో, జిల్లాసభలకో, ఆంధ్రదేశ గ్రంధాలయ మహాసభలకో, యాత్రలతో, మఱి దేనికో, పట్టణములకే కాక-పల్లెలకును హెచ్చుగా వెళ్ళుచు, చేసినను-చేయకున్నను అందఱసాయము కోరుచు, శక్తికొలది పాటుపడుచున్న గ్రంథాలయసేవకులే సంఘబలము కొంత కలవారగుటచే, తెనుఁగుతనము నిలువఁ బెట్టుటకును వారే పూసుకొనఁదగురని చెప్పఁదలఁచితిని. అది నేను చెప్పకముందే మీరు గుర్తించితిరి కాన, దానికి పూనుకొందురుగాక ! తెనుఁగుతనము నిలువబెట్టుట లోనే పొ.గు. కడంకపని అంతయు ఇమిడియున్నది. అట్లగుటచే అది మనకు స్వధర్మమే కాని పరధర్మము కాదు. ఇంతకు, మనము తెనుఁగువారి అందఱమేలును కోరి పనిచేయునపుడు అందఱసాయమును కోరుదుము. కొందరైనా మనకు తోడ్పడకపోరు. ఎవరెంతవఱకు తోడ్పడిన అంతవరకే మనము సంతసింపనకు. అండఱును అన్ని తెఱంగులు పనికివచ్చుకు అరిది. ఇది గుర్తించి మనము కలసి కట్టుతనముతో పనిచేయుచు, ఎవరియెడలను విరోధబుద్ధిలేక, ప్రేమచే మనసు కరగించి, వీలగు నంతమందిని మనలో చేర్చుకొనవలె. అపుడు మన ఉద్యమము తప్పక ఫలించును.

భేదబుద్ధి ఎఱుక లేమి; సమబుద్ధి ఎఱుక-అనఁగా బొంది ' వేఱు గానీ అందుఁగల ఆత్మ ఒకటియే అని గుర్తించుటయే ఎఱుక. అట్టి ఎఱుకకు మన పొ.గు. ఆటపట్టు. అందుచేతనే, “ఆది (పొ.గు.) మన నాగరకతలో ఆధ్యాత్మిక కేంద్రము" అనే హెచ్. ఏ. ఓవర్ స్ట్రీట్ పండితుఁడు. తక్కిన గుడులలో భేదబుద్ధికి తావుండుఁ గాక ! మన పొ.గుడిలో దానికి తావులేదు. మత భేదముతో మనకు