ఆధారమగు కార్యస్థానభవనమును కన్నువిందుగా శ్రీ సీతారామయ్యచౌదరిగారికి చూపుఁడు! ఆయనకు గ్రంథాలయోద్యమ మందుఁగల అమితోత్సాహమును సార్థకపఱుపుఁడు!!
ఆంధ్రదేశ కేంద్రగ్రంథాలయము
రామమోహనగ్రంధాలయము బెజవాడలో నెలకొల్పిన శాస్త్రి-పంతులు గార్లు దాని నే ఆం.దే.కేం.గ్రంథాలయముగాచేయ తీర్మానింపఁజేసిరి. కాని, దానికి ఏదో అడ్డువచ్చె. అందువలన క్రొత్తఁగా మరల ప్రయత్నము చేయవలసివచ్చినది. ౧౯౩౬ లో ప్రయత్నము చేసితిమి. అయినను, అదియు ఫలింప లేదు. ఇపుడు, అం.దే.గ్రం. సంఘమునకు నివేళసస్థలము లభించినది; కార్యస్థానభవనము నిర్మింప ప్రయత్నము చేయుచున్నాను. ఆది త్వరలోనే పూర్తికాకతప్పదు. అప్పుడు మనము చేయవలసిన మేటిపని కేంద్ర గ్రంధాలయము నెలకొల్పుటయే. అట్లని ఇప్పుడు మనము మిన్నకుండరాదు. పని అప్పుడు వడిగా జరుగుటకు ప్రయత్న మిప్పటినుండియు చేయవలె.
కొలికిముక్కలు
మనము తెనుఁగువారము, తెలుఁగువారము, ఆంధ్రులము-ఆని ఆనుకొనుచున్నాము. కాని, తెనుఁగుతనము, "తెలఁఁగతనము - ఆంధ్రత్వము-అనునది మనయందు కానవచ్చుచున్నదా? జుట్టు-బొట్టు-కట్టు లలో తెనుఁగుతనము పోవుచున్నది. పేర్లలో తెనుఁగుతనము పోవుచున్నది; పేర్లకు, సంతకములక, జాబులకు తెనుఁగువ్రాలు పనికిరాకున్నది. ఇంగ్లీషుమీఁదనో, హింది మీద ఉన్న మోజు కొందఱకు తెనుఁగుమీఁద లేకున్నది. పైవారిమీదనున్నంత గౌరవము తోడి తెనుఁగు వారిమీద కనఁబడకున్నది. పైనాడులమీఁదనున్న మన్నన తెనుఁగునాటిమీఁద కానరాకున్నది. ఇక తెనుఁగుతన మెక్కడ? ఆంధ్రరాష్ట్రము కావలెనని ఆంధ్రోద్యమము మొదలు పెట్టినాము; ఎప్పుడు? ౧౯౧౩ లో. ఇప్పటికిని రాష్ట్రము రాలేదు; కాని, ఉన్న దానిలో కొంతవూడినది. అది రాఁబట్టు కొనుటకుసైతము మనకు చేతఁగాకున్నది. ఇట్టివో, ఆంధ్రత్వమెక్కడ?
“ఆరంభశూరాః ఖులుదాక్షిణాత్యా" అను ఒక నిరసనవాక్యమెట్లో సంస్కృతమున బయలుదేఱింది. అది ఆంధ్రులమనుకొను మనకు అస్వయించినట్లు తక్కిన దక్షిణదేశస్థుల కెవరికిని ఆహ్వాయించుట లేదు. కాన, అది మనలను గూర్చియే పుట్టినదెమో మన కనులయేదుట మసనారు ఎన్ని ఉద్యమములలో ఆరంభ శూరత్వము చూపలేదు?' ఎన్నిటిలోనుండి చల్ల చల్లఁగా జారిపోలేదు? తక్కినవానిమాట ఏల? ఆంధ్రోద్యమము ఎంతపటాటోపముతో మొదలు పెట్టినారో! ఎంత గుప్పు చెప్పగా దానిని వదలి వేసినరో? ఎవరికి తెలియదు? ముంజేతి కంకణమునకు అద్దము కావలెనా? పెద్దలందఱురు స్వరాజ్యోద్యమములో చేరి, దీనిపై చిఱుకన్ను వేసినారు. ఇప్పుడు, ఎవరో ఎంతో తాపత్రయపడినేకాని అప్పుడప్పుడేసి దానిసభలే జరుగుట కష్టముగా ఉన్నది. ఈ దురవస్థచూచిన తెనుఁగువాటిపై అభిమానమున్న వారికి ఎవరికీ పగపు పుట్టకుండును? కానీ, ఏ ఒక్కరుగాని ఏమిచేయఁగలరు? “సంఘేశక్తిః కలౌయుగే" అనినారు పెద్దలు. సంఘముందే కలియుగమున శక్తికలదు; వ్యక్తులయందు శక్తి లేదు.
అయిన, తెనుఁగుతనమునకు తిలాంజలియేనా? అందురేమో ఎవరేని! తొందరపడక వినుఁడు. తెనుఁగునాట గ్రంధాలయోద్యమము పెద్దల పెద్దఱికమున ప్రారంభము కాలేదు. పెద్ద పరీక్షలిచ్చి-బిరుదులు గడింపని ఒక ఒజ్జ- ఆదినారాయణమూర్తి వ్యక్తి ప్రధానముగా మొదలుపెట్టె; నిజముగా ఆయన మేరు శ్రీ చల్లపల్లి రాజుగారొక సారి చెప్పినట్లు, లిఖి చువారున్న, సువర్ణాక్షరములలో లిఖింపవలసిందే. అట్లే పరీక్షాబిరుదములు లేని ఒక తెగువరి-వేంకటరమణ మూర్తి-సంఘప్రధానముగా బయలు చేసిన ఆ ఉద్యమపు బరువు నెత్తిమీఁద వేసికొని, సాయమున్నరు. లేకున్నను వేసర చెందక, వివిధబాధలుపడి దానిని నిలువఁబెట్టె; ఈయన పేరు మనము సువర్ణాక్షరములతో లిఖింపవలదా? మన మటు చేసినను-చేయకున్నను, అది పొ.గు. కడంక పొత్తములలోను-తక్కిన వ్రాఁతలలోను ఇండియా