సంబంధించిన జ్ఞానమంతగ లేదు. అనుభవపరులిందులో కొందరుండ వచ్చును. కాని వారి అనుభవము సహితము తప్పులు చేయుచు దిద్దుకొనుచుండుటతో సరి పోవును. గ్రంథాలయ నిర్వాహకులకు సశాస్త్రీయముగ శిక్షణనిచ్చు నిమి త్తము ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘమువారిటీవలనే ఏర్పాటు చేసి యున్నారు. అయినను ఎక్కువమంది గ్రంథాలయ సేవకు లీయవకాశమును వినియోగించుకొన జాలకున్నారు. ఇట్టిపరిస్థితులలో అనుభవపూర్వకమగు వ్యాసముల ద్వారా గ్రం థాలయ సేవకులకు సశాస్త్రీయమగు గ్రంథాలయ విజ్ఞానము నందుబాటులో నుంచుటకును, వేరు వేరు స్థలములు సాగుచున్న గ్రంథాలయ సేవాకార్యములు వెల్ల డించుటద్వారా వారిలో నుత్సాహమును రేకెత్తించి పనులు చురుకుగ జరుగు నట్లు చేయుటకును అవకాశముండును. ఈ పనికై ఇతరులమీద ఆధారపడుటకు వీలు లేదు. కనుక ఎన్నిశ్రమల కోర్చియైనను 'ఆంధ్రగ్రంధాలయం'ను నిర్వహిం చుట గ్రంధాలయోద్యమ సేవకుల విధిగ పరిగణించుచున్నాము.
గ్రంథాలయ సేవకుల తోడ్పాటు
ఈ పత్రిక క్రమముగ వెలువడుటకు గ్రంథాలయ సేవకులందరు తోడ్పడవలెను. ఒక్కరుగ నెవ్వరు గాని ఈ కార్యమును నెరవేర్చుట దుస్తరము. కాన గ్రంథాలయ ముల నిర్వాహకులును, ఉద్యమాభిమానులును దీని ప్రచారమునకై పూనుకొన వలెను. ఎవ్వరెవ్వరి శక్తిసామర్థ్యముల ననుసరించి వారీపత్రికకు చందాలను విరాళములను రాబట్టుటకు ప్రయత్నించుట మొదట చేయవలసినపని. గ్రంధా లయ సేవకులు తమ కార్యక్రమసమాచారములను ఎప్పటికప్పుడు తెలియజేయుచు గ్రంథాలయ శిక్షితులును, గంథాలయశాస్త్రమును చదివినవారును, గ్రంథాలయ నిర్వహణమునకు సంబంధించిన వివిధ విషయములనుగూర్చి మనదేశ పరిస్థితుల కను కూలపడు విధమున వ్యాసములను వ్రాసిపంపుచు- ఇట్లు ఎవరికి చేతనైన సాయ మును వారు చేయుచునున్న మాపత్రిక సకాలమున వెలువడుచు ఉద్యమాభివృద్ధికి చాలగ తోడ్పడగలదు.
వయోజనవిద్య
ఇటీవల వయోజన విద్యావిషయ మొక ప్రత్యేక ఉద్యమముగ బయలు దేరినది. రాష్ట్రీయ ప్రభుత్వములు జాతీయవాదులు చేజిక్కుటతో దీనికి గొప్పబలము చేకూరి నది. జాతీయవాదుల చేతినుండి ప్రభుత్వములు జారిపోయిన తదుపరికూడ దేశ శ్రేయోభిలాషులగు యువకు లెక్కువగ నీ కార్యక్రమమునకుబూనిరి. వయోజన విద్యాప్రచారము గ్రంథాలయములు ప్రధానకర్తవ్యముగ చాలకాలము క్రితమే గుర్తింపబడినది. గ్రంథాలయములు లేకుండ వయోజనవిద్యావ్యాప్తి జరుగు టసం భవమని తెలిసియే బీహారు మున్నగురాష్ట్రములలోని ప్రభుత్వములు తమ వయో