'బ్రూసు-సాలీఁడు' కథలో సాలీడు చేసిన ప్రయత్నములవలె; నాల్గవసారి ఈయన నన్ను ముట్టడించినపుడు, ఆంధ్ర మిత్రులయెడల నాకున్న అభిమానమునుబట్టి నేను లొంగిపోతిని. ఈయన పట్టుదల విజయమందినది." అని ఆయన సెలవిచ్చిరి.
ఇట్లు తమ పట్టుదలవలన ఈయన ఎండఱనో లొంగఁదీసికొని, తమ సంఘమే బ్రిటీష్౦డియాలోని పొ.గు.కడంకమేనికి గుండెకాయగా చేయఁగలిగినారు. అది తనకు 'నాది' అని చెప్పుకొనుటకు విడిగా ఇల్లులేక, ఈయనయింటనే ౧౯౩౬ ఆగస్టు 5వ తేది వఱకును తలదాఁచుకొన్నది. నాడు నన్నీయన కార్యనిర్వాహక సంఘమునకు అధ్యక్షునిగా ఎన్నుకొనఁజేసిన పిదప, కార్యస్థానము నేనుండిన ఖద్దరుసంస్థాన గాంధీ విలాసభవనము లోనికి మాఱినది. ౧౯౩౯ లో శ్రీ పాతూరి నాగభూషణము గారిని కార్యదర్శిగా ఎన్నుకొనినపిమ్మట, అది పటమటలంకకు చేరినది. ఇప్పుడు అక్కడనే ఉన్నది; 'నాయిల్లు' అనీ చెప్పుకొని అందుండు అదృష్టము ఎప్పుడుపట్టునా! ఆనియ గ్రంధాలయోద్యమాభిమానులగు మామనస్సులు ఎప్పుడు కరగునా! అనియు, పటమటలంకలోని గాఁధి గ్రంధాలయమున తపస్సు చేయుచున్నది. గ్రంధాలయనిధి లెర్పఱుచుటకు ఆమెరికా సంయుక్త రాష్ట్రములలో ఆండ్రూకార్నిజీ వెలసె. మనకు తోడ్పడుటకు కోటీశ్వరులును లేరు; లక్షాధికొరులును లేరు. కొని, దైవానుగ్రహమున గ్రంథాలయోద్యమాభిమాని అగు వేలపెద్ద ఒకరు దొరకినారు, ఆయన పటమటలంక వారు; శ్రీ కొమ్మా సీతారామయ్య చౌదరి గారు; తమ ఊరిదగ్గఱ కార్యస్థానమేర్పాటుచేయునెడ నివేళస్థలము కొనుటకు రు ౧౦౦౦ లు విరాళమిచ్చెదనని మాటయిచ్చినరు; ఇచ్చినారు. దానికితోడు రు ౮౦౦ అప్పుచేసి, నాగభూషణముగారు బెజవాడ బందరు రోడ్డు పక్కను, పటమటలంక దారికి ఎదురుగానున్న యెకరమభూమి కొనినారు; డబ్బీయకముందే దానిలో శంకుస్థాపనము చేసినాము; అప్పుతీర్చుటకు సరిపోవుసొమ్ము కొందఱిచ్చెదనునివారు; అందు కొంత వసూలైనది; కొంతవసూలుకావలె; ఆదియు వసూలగునుకొందము; అప్పుతీఱునసుకొందము. ఇక, కార్యస్థానభవనము మాటయేమి? అది ఇప్పటికి కాగితముమీఁది కెక్కినది; మీరు చూడ వచ్చును. దానికి ఐదువేల రూపాయలు కావలె. గ్రంధాలయోద్యమాభిమాలను మీరు పూనుకొనుచో స్వహస్తపరిరహస్తములచే ఈకొలది "మొత్తము చేర్చుట కడిందిపని కాదు. కాన, మీరందఱును సాధ్యమగునంత త్వరలో ఇపుడు కాగితముమీఁదనున్న భవనమును నేలమీఁద నిలుపుదురు గాక! ఆం.దే.గ్రం.సంఘమును ఒక యిఁటిదానిని చేయుదురుగాక ! మీరింతమాత్రము చేయుదురేని, మన కార్నీజీగారు తామిప్పుడిచ్చిన దానికంటే కొన్ని రేట్లు హెచ్చు విరాళమిచ్చు నిశ్చయముతో ఉన్నారని తెలియవచ్చుచున్నది. ఇట్టి అవకాశము గ్రంధాలయాభిమానులు పోగొట్టుకొనవచ్చునా? త్వరపడుఁడు! త్వరపడుఁడ! విరాళములు వసూలుచేయుఁడ! భవనముకట్టిఁపుఁడ! అందు ప్రవేశింపుఁడు! అది ఆం.దే.గ్రం.సం. కార్యస్థానముచేయుఁడు! మన కార్నీజీగారిని మెప్పింపుఁడ! ఆయనకు తగినంత ఉత్సాహముకలిగింపుఁడు! అపుడు, ఆయన దానశౌండత్వము చూడుఁడు! ఆలస్యముమీదే; ఆయనదికాదు. ఆయన యీవి తెగువచూచి, తక్కిన గ్రంధాలయాభిమానులును తమతమ యీవి తెగువచూపకపోరు. అపుడు, నాగభూషణముగారు సంచార కార్యదర్శి సాహాయ్యమును-వలయు తక్కిన సాయమును పొందగలిగి పైని మనము ఊరిపొత్తపుగుడులను గూర్చి చేయవలయుననుకొని పనులను, పనులును, పట్టణనగర గ్రంధాలయముల పనులును, నగరపట్టణగ్రంథాలయసంఘముల పనులును, జిల్లా తాలూకాఫిర్కా గ్రంథాలయ సంఘముల పనులును ఇప్పటికంటే ఎంతోబాగుగా సాగించి, తమ సంఘాధ్యక్షోపాధ్యములయు-సభ్యులయు - సాయముతోడను-ముఖ్యముగా గౌరవ సభ్యులగు శ్రీ వేంకటరమణయ్య గారి తోడ్పాటుతోడను– తెనుఁగునాటి గ్రంథాలయోద్యమము క్షీణదశలో ఉన్నదన్న వారిచేతినే అది ఉచ్ఛదశలో ఉన్నదని పొగడునట్లు చేయఁలుగుదురు. అట్టిస్థితిలోనికి వచ్చుటకు ప్రయత్నించుట మనధర్మముని మనలో ఎఱుఁగనివారెవరు? కాన, మనపనికి అంతకును