Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంధాలయములవారును, గ్రంథాలయ సంఘములవారును పనిచేయక తప్పదు. అందు, తక్కిన (గ్రంధాలయ సంఘములపై పెద్దఱికము చేయుచున్న

ఆంధ్రదేశగ్రంథాలయసంఘము

వారు తక్కినవారికి దారిచూపవలెను. ఈ సంఘము ౧౯౧౪ లో ఏర్పడినది; ఇండియాలోని రాష్ట్రములలో నేమి, సంస్థానములలో నేమి ఏర్పడిన గ్రంథాలయ సంఘములన్నియు దీని తరువాత పెక్కేండ్లకు ఏర్పడినవే. కాస, ఇండియా అంతటిలోను మొట్ట మొదట ఏర్పడిన పెద్ద గ్రంధాలయసంఘము-ఆంధ్రదేశగ్రంధాలయసంఘమే; ఇది కొన్ని యేండ్లు కీ.శే.సూరి నరసింహశాస్త్రి - శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గార్ల యిద్దుఱ పెద్దఱీకమునను, కొన్ని యేండ్లు ఒక్క వేంకటరమణయ్య గారి పెద్దఱిక్షమునను, పనిచేసినది; పేరు తెచ్చుకొన్నది; ఇపుడు శ్రీ పాతూరి నాగభూషణముగారి పెద్దఱికమున పని చేయుచున్నది. శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు సంఘాధ్యక్షులు కదా? ఇట్లు౦దువేమి? అని ఎవరేని అందురేమో! అది ఎఱుఁగక నేననలేదు. అధ్యక్షుల పెద్దఱికము సభాసమయముననే; తక్కినపుడెల్ల పెద్దఱికము కార్యదర్శిదే; అంతేకాదు; సభాసమయమున కూడ కార్యదర్శి చేసినపనికి మొత్తముమీఁద అధ్యక్షుడును తక్కిన సభ్యులును అంగీకరింపక తప్పదు. కానీ, ఏ సంఘమునకుఁగాని నిక్కపు పెద్ద కార్యదర్శియే.

సంఘప్రధానమగు మన గ్రంధాలయోద్యమములో నరసింహశాస్త్రిగారు మింటితల్లికవలె మెఱసి నారు; దారిచూపినారు; వేరోందినారు; పొగడికలందినారు; మన దురదృష్టమున అకాలమృత్యువు వాతఁ పడినారు. ఆయన ఆత్మ తెనుఁగునాట అంతేకాదు-ఇండియాలో గ్రంధాలయోద్యమము బాగుగా వ్యాపించి-పూచి-పండి-తన్ను నమ్ముకొన్నవారిని ఆప౦టచే తనుపుదనుక తనియదు. కాన, ఆయన ఇప్పటికీ తెనుఁగునాట ఎక్కడనో పుట్టియుండును; పుట్టనిచో త్వరలో పుట్టుఁగాక! కొఱఁత తీర్చి, తనియుఁగాక !

ఇక, వేంకటరమణయ్యగారు; ఈయన ఉత్సాహమునకు మేరలేదు; పట్టుదలను పట్టుటకు పగ్గములు లేవు; ఈయన గ్రంధాలయోద్యమమునకు ప్రాణము; అంతేకాదు; గ్రంధాలయోద్యమమే ఈయన. తనదే గ్రంధాలయోద్యమమనియు తానే గ్రంధాలయోద్యమమనియు పడరానిపాట్లు పడి, కావలసినంతడబ్బు నీళ్ళవలె వెచ్చించి, వెళ్ళరాని చోట్లకు వెళ్ళి, ఎందఱకో జాబులు వ్రాసి, తంతి వార్తలిచ్చి, బుజ్జగించి, ప్రోత్సహించి, చెప్పి, అడిగి, వేఁడి, బతిమాలి, పొ.గుడులు ఉత్సవములు-సభలు- మహాసభలు- ప్రదర్శనములు పెట్టించి, యాత్రలు సాగించి, ఉపన్యాసములు చెప్పి, చెప్పించి, వ్యాసములు వాసి-వ్రాయించి, పాటలు-పద్యములు-పొత్తములు వ్రాయించి, బండ్లమీఁద-రైళ్ళ మీఁద, కారులమీద, బస్సులమీఁద పరుగులెత్తి-గ్రంథాలయోద్యమము ఆంధ్రదేశమున నేకాక, ఇండియాలో నిలువఁబెట్టి, ఆం.దే. గ్రం.సం. కార్యదర్శి పదవి యీనడుము వదలివేయువఱకును తదేకదీక్షగా పనిచేసిరి. 'గ్రంథాలయోద్ధారక' 'గ్రంథాలయశాస్త్ర విశారద' బిరుదములందిన మహావ్యక్తి-గ్రంధాలయోద్యమమూర్తి ఈయన. ఈయన పేరు పొ.గు.వ్రాగమిలో పైనాడులలో కూడ నెలకొనింది. ఈయన ఎందఱు పోత్రములతో పాత్రమయెయె. అందు, రావ్ బహద్దరు ప్రణతార్దిహరయ్యరు గారు వేంకట రమణయ్య గారి పట్టుదలను గూర్చి చెప్పిన మాటలు మఱవరానివి — “నావయస్సునుబట్టి నేను కొంత కాలమునుండి ప్రజోద్యమములలో పాల్గొనుటలేదు. కాని, ఆం.దే.గ్రం.సం. ప్రాణమగు శ్రీ అయ్యంకి వేంకటరమణయ్యగారు అన్ని నిరోధములను అతిక్రమించి-జయించు తమ ఉద్యమమందలి ఆనివార్యోత్సాహములో ముసలితనమును సైతమును పాటి౦చువారుకారు. మూడుసార్లు నన్నీ పనిచేయవేఁడుచు నాదగ్గఱకు వచ్చినారు; ప్రతిసారియు నేనిందుల కంగీకరింపజాలనని నాఅశక్తిని తెలిపితిని. 'కాని 'తప్పిపోవుట' అను ముక్క వేంకటరమణయ్య గారు తమ నిఘంటువులోనుండి తొలగించినారు.