పొ.గు. కొలువరులుగా చేర్చుకొనవచ్చుననిరి. కొందఱు గ్రామపంచాయతిపనియు-సహకార సంఘపు పనియు చేయువారిని సూచించిరి. కవులను-పండితులనుకూడ ఈజట్టులో చేర్పనగును. చదువుకొన్న నిరుద్యోగులలో కలవారుగు, బీదవారును, ఉందురు; ఇట్టి బీదలకు వీలున్నంతవఱకు ఏదోముట్టఁ జెప్పవచ్చును. అయిన, వారు తమంత తాము వచ్చుట అరిది. కానీ, గ్రంధాలయాభిమానులు తాము స్వయముగా పని చేయువీలు లేనివారు పైని పేర్కొని వారిలో తగిన వారిని ఎంచి, వారిని ప్రోత్సహించి, వారిచేత పనిచేయింపవలె; వారు మాట కారులును-వ్రాత కారులు నైన మఱియు మేలు. తామును వీలున్నంతవఱకు వారికే తోడ్పడవలె. వీరు తమమేలు లెక్కింపక తోడివారిమేలే చూచునపుడు నా ప్రయత్నము నెఱువేఱుటకు హెచ్చువీలుండుననియే మనము గుర్తింపనగును.పొ.గు.కడంక ముఖ్యముగా చదువురాని వారికొఱకే ఆసుమాట మఖువరాదు. ఉన్న పొ.గుడులు సరిగా పనిచేయునట్లు చూచుట మనకు మొదటిపని పోయినవి ఏలపోయినవో! పేరుకు ఉన్నవి ఏల పని చేయుటలేదో! పిదప కనుగొని, వానిని లేవనెత్తి, పనిచేయునట్లు చేయుట రెండవపని; క్రొత్తవి పెట్టించుట మూడవపని; వానికన్నింటికిని నిలుకడము, సెపురు, తగినవాడుకయు కలిగించుట నాలుగవసని. ఈ నలుతెఱఁగుపని జరుకుటకు మనమెంతో చేయవలసి యున్నది. చూడుఁడు.
(౧) ఎన్నియేండ్లనుఁడియో చిన్న పెద్ద పొ.గుడులలో ఉండవలసిన యెంపుడుపొత్తముల జాబితాలు తయారుచేయవలెనని తీర్మానించుచున్నను, నేఁటివఱకును ఆ పనిజరులేదు. కాన, ఆంధ్రవాఙ్మయ సూచిక సాయమును బట్టియు, అనుభవమును బట్టియు ౧౦౦,ఽ౦౦,౩౦౦,౪౦౦,౫౦౦,౬౦౦,౭౫౦,౧౦౦౦ చొ॥పొత్తముల జాబితాలు త్వరలో తయారు చేయవలెను. వీనిలో మంచి వారి మనుగడలు, నాటి మనుగడలు, ప్రకృతి శాస్త్రములు, వృత్తుల పొత్తమలు,చరిత్ర నవలలు, నీతికథలు, ఎంపుడు కావ్యములు, నాటకములు మొ. చేర్పవలెను; అవి ముగించిన పిమ్మట ఆ మీది మొత్తములవి సిద్ధపఱుపనగును. ఈ జాబితాలలో దివిజ్ఞానసమాజము వారి పొత్తములు చేర్పనగురు.
(౨) పనికిమాలిన పొత్తములను, చెడుడతలను గుర్చి తెలుపు ఉత్తములును పత్రికలను తొలగింపవలెను.
(౩) సేద్యము, నేత మొదలగు వృత్తులను గూర్చియు, నేల-నీరు-గాలి మెఱపుబలిమి (ఎలెక్ట్రిసిటీ) నాజూకుతనము-ఓర్పు-గరగిరికి-పొదుపు కలసికట్టుతనము-తెగువ-నిబ్బరము-అడఁకువ-పెట్టుపోతలు-ప్రోపుకాపులు కనికరము-బంటుతనము-తల్లి పలుకుమన్నన- తల్లినాటిమన్నన-పెఱలమన్నన-కొలువుమన్నన-గ్రామచరిత్ర మొదలగు తెలలను గూర్చి తేట తెనుఁగున పొత్తములు వ్రాసి వ్రాయించి, అచ్చొత్తించి, తగిన వెలలకు పొ.గుడులకు చేర్పవలెను.
(౪) రాతి-రాగి శాసనములు, ప్రార్థనాణెములు, ప్రాణి రాతిబొమ్మలు, ప్రాఁత వ్రాఁత పొత్తములు, ప్రాఁత పనిముట్లు, వింతముట్లు, మొదలగునవి చేర్చి, వానిని భద్రపఱుపవలెను.
(౫) పొత్తపుగుడితో పొత్తుగలవారి కెల్ల మంచి అలవాట్లును, మర్యాదలును, ఆడఁకువ-నెమ్మది మొదలగు సుగుణములును అబ్బునట్లు చేయవలె.
(౬) బొమ్మలాటలును-భాగవతములును-వీధినాటకములును ఆడించినపుడు మోటుహాస్యమునకుఁ గాని, మోటుమాటలకుఁ గాని తావీయకుండ చూడవలెను; పురాణములును, హరికథలును చెప్పించునపుడును, ఉపన్యాసము లిప్పించునపుడును నిరసపు వెక్కిరింపులు రాకుండ మెలఁకువచూపలెను.
(౭) ఊరి ఉమ్మడి రాబడినుండియు, దేవాదాయ ధర్మాదాయములనుండియు, పరపతి సంఘములు మొ. వానినుండియు, ధనికలకు దాతలనుండియు, స్థానిక సంస్థల నుండియు, దొరతనము వారి నుండియు, బిడ్డలు లేనివారి ఆస్తులనుండియు, పొ.గుడులకు డబ్బు రాబట్టవలెను.
(౮) ఊరిపొత్తపుగుడు లొండొంటికి తోడ్పడుచు, పె౦పుడె౦దుటలోను మేలుచేయుటలోను పోటీపడి పనిచేయవలెను.