బాధ్యత గుర్తించి, మన పొత్తపు గుడులను మంచి స్థితిలోనికి తెచ్చుటకు ప్రయత్నించుట మనధర్మము. ఆధర్మము మనలో ఎవరికి వీలగునంతవఱకు వారేదోచేయుటతో పూర్తికాదు. మన గ్రంధాలయోద్యమమునకు ఆం.దే.గ్రం.సంఘము ఆధారము. దాని కార్యనిర్వాహకులకు-అందు ముఖ్యముగా కార్యదర్శికి—తక్కిన గ్రంధాలయాభిమానులెల్లరుకు తోడ్పడవలె. అట్టి తోడ్పాటు ఇంతకుముందు మొదటి నుండియు మొన్న మొన్నటి వఱకును కార్యదర్శిగా ఉండిన శ్రీ వేంకటరమణయ్య గారికిఁ గాని, ఇప్పుడు కార్యదర్శిగాఉన్న శ్రీ నాగభూపణము గారికిఁ గాని, కలిగినదనిగాని, కలుగుచున్నదనిగాని, సంతసింపఁజాలము. అట్టితోడ్పాటే కలుగుచో ఆంధ్రగ్రంధాలయ సర్వస్వమేలపోవును? 'గ్రంథాలయ' మేల సరిగా సాగకుండును? ఇది గుర్తిఁతుముగాక! ఇప్పటి నుండియేని మనధర్మమును పాటించి, మనతల్లి సంఘ కార్యదర్శిగారికి శక్తికొలంది తోడ్పడి, దానివలన మేలొందుదుము గాక!!
చేయవలసినపని
"గుండెలో ఎల్లఁడెపుడు మేల్కొననో! ఆపుడె,
వానీపైపిలుపును విన వచ్చుమనకు.”
అని ఎఱుకగలవారందురు. పైపిలుపు మనకు వినవచ్చునపుడే మనతోడివారికి మనము ఇంతో అంతో మేలుచేయఁజాలుదుము. కాని, ఆపిలుపు మనలోపలనున్న పరమాత్మ మేల్కొనునునప్పుడు గాని-మనకు ఎఱుకలిగినఁగాని-వినఁబడదఁట! నిజమే. మనలోపలను-వెలుపలను ఒక్క పరమాత్మయే ఉన్నట్లు తెలిసినపుడే ఎళ్లఉసుఱులు మనవఁటివేఅనియు, అందఱును మనవంటివారేనియు, వారు మనవారే ఆనియు, తెలియవచ్చును. మనవారి పిలుపు మనకు వినవచ్చుట వింత కాసేరదు; మనము వారికి మేలు చేయట అంతకంటే వింత కానేరదు. కానీ, పైని తెలిపిన ఎఱుక-నిండెఱుక-కలుగుట ఎట్లు? మొత్తముమీఁద మన తలిదండ్రులుగాని, మనఒజ్ఞలు గాని, మనపీఠాధిపతులుగానీ, అట్టి ఎఱుక మనకు కలిగించుటలేదు. ఎప్పుడో ఎవరో మనకు ఎఱుకఱపిరను, అది దానిగుంటలోని కుక్కకు కుకలుగు ఎఱుకవఁటిడే అగుచున్నది. ఎవరికో ఒకరికి ఎఱుక నాటును గాక! అందఱకును అది నాటుటలేదు; దానివలన జరుగవలసినపని జరుగుటలేదు. దానికి కతము ఎఱుక మనలో పాదుకొనునట్లు చేయుటకు వలయు ఏర్పాటు లేమియే. జాని కతము మన బానిసత్వమే. మనలో ఇది తెలిసినవారు ఏదో సంఘము వలన తోడివారికి ఎఱుక అబ్బుటకు ఎడతెగకు పాటుపడవలసి యున్నది. అందుఱకే కొన్ని సంఘములు మనవారు కొండఱు పెట్టినారు. కాని, ఆవియు అనుకొన్నపని పెక్కు కారణములచే చేయఁజాల కున్నవి. హోదాలమీఁద మనకున్నంత మోజు పనిమీఁద లేకున్నది. అందుచేత చేయఁదలఁచుకొన్న పని వదలివేసి, జపమువిడిచి లొట్టలువేసినట్లు, జట్టీలలో పడిపోవుచున్నాము. పొ.గు.లోని పొత్తము వాడుకొనక పాడుచేయునట్లే మన కబ్బిన ఎఱుకనుకూడ కొతిమాలినదానినిగా చేయుచున్నాము. విందులలోను, సభలలోను, ఫోటోలు తీయించుకొనుటలోనూ, మనము హెచ్చుగా కనఁబడుదుము గాని, పని చేయవలసివచ్చినపుడు కొందఱమే కనఁబడుదుము; ఒక్కరమే అనుమందురా? ఒక్కాక్కప్పుడు ఆదియం జరుగక పోవుటలేదు. కాని, మొత్తముమీఁద కొండఱము కనఁబడుట జరుగు చున్నది. పెక్కురము కనఁబడుట లేదనియే మనవగపు. అందుచేతనే అంగబలము మనకు చాలకున్నదనియు, తక్కినలోటులతోపాటు ఈ లోటును తీర్చుకొనుటకు వెరవులు చూడనగుననియు అనుకొనినారము.
పుదుకోట మహారాజ కాలేజి పొత్తపుతీర్పరి అగు శ్రీఆర్.అనంత నారాయణన్ గారు దారి పొ.గు.యేర్పాటును గూర్చి మాటలాడుచు, ఇల్లును-పొత్తములునుగాక, మంచిపనికారులు-పనిచేయువారు—ఇప్పటిఉనికినిబట్టి మాఱుమేలుకోరనివారు కావలెనని పించనుదార్లును, చదువుకొన్న నిరుద్యోగులను, విద్యార్థులును, పట్టభద్రులును, గ్రామోపాధ్యాయులును తగినవారుకాన, వారిని