Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయోద్యమము, నిజమునకు, విద్యాశాఖలోనిదే. అయినను, దొరతనమువారు దానిపనికి పూనుకొనమిచే మనమే ఆపని చేయవలసివచ్చినది. హెచ్చుపొత్తములుండుటచే పొ.గు. గొప్పదనిపించుకోమనని మనలో కొందఱింకను తలంచుచున్నట్లు కానవచ్చుచున్నది. ఆతలంపు సరిపోయినది కాదు. ఉన్న పొత్తములు తక్కువయే అయినను అవి దేనిలో బాగుగా వాడుకలోనికి వచ్చి చదువరులకు మేలుకలిగించునో ఆ పొ.గుడియే గొప్పది. పొత్తములు వాడుకలోనికి వచ్చుట అనంగా పొ.గుడికి చదువరులు వచ్చివాడు కొనుటయో, అవి ఊరిలోని చదువరులు ఇండ్లకు తీసికొనివెళ్ళియో-రప్పించుకొనియో వాడుకొనుటయో కాదు; చదువరు లెక్కడమున్నును పొత్తములువారి దగ్గఱకుచేర్పఁగా వారు వాడుకొనుటయు అగును; నిజమునకు ఆదేమిన్న. పొ.గు.కడంక బాగుగా సాగునాడులలో పొత్తము లిట్టువాడుకలోనికి వచ్చుటకే హెచ్చుగా కడంగుచున్నారు. ఇంతేకాక, ఎవరు ఏబోగట్టా కోరినను పొ.గు.వారు వారికి అది తెలుపఁగలుగుటయు పొ.గుడికి గొప్పఁదనము తెచ్చును. కాన, ఇవి పొ.గుడులు నడుపువారు బాగుగా గుర్తింపనగును. ఇంతఏల? కలవానికి వలెనే పొత్తిపుకుడికిని ఇచ్చుటవలననే గోప్పదనము వచ్చును గాని, దాఁచుకొనుటవలన రాదు.

మఱోకమాట. పొ.గుడి చదువుకొనిన వారికే పనికివచ్చుట చాలదు; అందు, నూటికి తొంబదిమందికి పైఁగా చదువురాని వారున్న మననాట అదీబొత్తిగా చాలదు. చాలక పోవుటయే కాదు. చదువురాని వారికి పనికిరాని పొ.గుడి పనికిరానిదే అనిపించుకొనును. అందువలన, చదువురాని వారికి చదువు చెప్పియు, పురాణములు చదివించుట—ఉపన్యాసము విప్పించుట-బొమ్మలుచూపుట మొదలగు పెక్కు వెరవుల వారికి ఎఱుక కలిగించియు, పొ.గుడులవారు పాటు పడనగును -కొన్ని పొ.గుడులలో ఇట్టి పని కొంతఱరుగుచుండుట సంతోషకరమే. కాని, ఉన్నఅన్నింటిలోను ఇప్పటికంటే హెచ్చుగా ఈ పని జరుగవలసియున్నది. అటు జరుగనిచో అవి మంది సొ.గుడులనిపించు కొనఁజాలవు. రైతులను బాగుచేయుట మంది పొ.గుడిపని. మన రైతులకంటే తెలివిగలవారు కాని రష్యా మౌజిక్కులను అచ్చటి మంది పొ.గుడులు సేద్యములో నుంచి నేర్పరులుగా చేయఁజాలినవి,

పొ.గుడులు సరిగా పనిచేయుటకు పొత్తపుతీర్పరి గట్టివాఁడు కావలె; అతఁడు తన పొ.గుడిలోని పొత్తము లన్నియుచదివి, వాని నిగ్గు తెలిసికొనఁగలవాఁడై ఉండవలె; కోరినబోగట్టా చెప్పఁగలిగి యుండవలె; పొత్తము లెట్లమర్పవలెనో గుర్తెఱింగి యుండవలె. కాని, అట్టి పొత్తపు తీర్పరులు తక్కువగా ఉన్నారు. చదువుకొనినవారును, ఓర్పుగలవారును, తోడివారి మేలు కోరువారును మాత్రమే పొత్తపుతీర్పరులుగా ఉండుటకు తగినవారు. వారు చదువరులను పిలిచి విందుచేయటమేలు; చదువరుల యిండ్లలోనే విందొనరించుట మఱింతమంచిది; వారు ఇంటివారు కావలెఁగాని కావలివారు కారాదు.

నిలుకడ పొ.గుడులేకాక సంచార గ్రంధాలయములును అవిలేనిచోట పనిచేయవలెను. ఆలమూరి లోను, కుప్పములోను, నడ పొ.గుడులు పనిచేసినట్లు తెలియవచ్చినది. బెజవాడలో ఈనడుమ హనుమంతరాయ గ్రంథాలయమువారు నడ పొ.గు. పనిచేయ మొదలిడినారు. కాని, జరుగవలసిన దానిలో ఇది చాలతక్కువ.

ఉత్సవములు-సభలు-మహాసభలు

గ్రంధాలయములు వార్షికోత్సవములు, సభలను జరపుచున్నవి. తాలూకా మహాసభలును, జిల్లా మహాసభలుసు, ఆంధ్రదేశ గ్రంధాలయ మహాసభలును జరుగుచున్నవి. సంతోషమే; కాని, వీనితో మనము లేనియరాదు. సంవత్సరము పొడుగునను పొ.గు. పని పట్టణములలోను-నగరములలోను-ఏవోకొన్ని పల్లెలలోను మాత్రముగాక, ఉన్న పొ.గుడులన్నింటిలోను చదువుకొనిన వారికిని, చదువుకొనని వారికిని, దగ్గఱివారికిని దవ్వులవారికిని-పనికివచ్చునట్లు పని జరుగునప్పుడే మనము తనియనగును. పరిస్థితులను బట్టి మన పొ.గుడులట్టిస్థితిలోనికి ఇప్పటికిని రాలేదని మన మెఱుంగుదుము. కాని, మన