భ్రమయో! ఓర్వలేమియో! చలమో! మఱెమో! కావలె. భాషలను బట్టి కాంగ్రెస్సువారు రాష్ట్రములుగా విభజించినవానిలో మన తెనుఁగునాడు ఒకటి. దీనిలో మఱియేనాటనుగానీ, పొ.గు.కడంకను మననాట సాగునటు సాగుటలేదు. సంస్థానములలో కూడ ఒక్క బరోడా సంస్థానమే గ్రంథాలయోద్యమమున మన తెనుఁగునాటిని మించి పనిచేయుచున్నది. దానికి కారణము దొరతనపు తోడ్పాటే. అట్టి తోడ్పాటే మనకున్నచో మనమును బరోడావారితో పోటీపడి పనిచేసియుందుము! వారిని మించినను- మించకున్నను, వారితో సరిగానైన పనిచేసి యుందును! అది ఆటుండనిండు. ఇండియా మొత్తము మీఁద పాశ్చాత్యపద్ధతిని పొ.గు. కథంక ఎక్కడ బయలుదేఱినది? అని పరికించునెడల అది తెనుఁగునాటనే కాని మఱకచోట కాదు. ౧౮౮౬ లో పడమటితీరున సరిగా తెనుఁగు నాట మొట్టమొదటి మంది పొ.గుడి బయలుదేఱఁగా, ౧౯౧౦ లో బరోడాలో పొ.గు. కడంక తలయెత్తినది. కాన, ఇండియాలో పొ.గు.కడంక మొదలు పెట్టిన పేరు తెనుఁగునాటిది కాని, మఱోకనాటికి కాదు. బ్రిటిషిండియాలో గ్రంధాలయోద్యమము బాగుగా నడచునాడు తెనుఁగునాడే కాని, మఱొకటికాదు, తమనాటి గ్రంధాలయసంఘ మేర్పఱుచుటకే కాక, అఖిలభారత ప్రజా గ్రంథాలయసంఘ మేర్పఱుచుటకు మొదట పూనుకొనినవారు తెనుఁగువారే కాని, మఱోకరుకారు. అఖిల భారత ప్రజా గ్రంధాలయ మహాసభలునూ, వానితో ప్రదర్శనములును, తెరుఁగువారి పెద్దఱికముననే హెచ్చుగా జరిగినవి. గ్రంథాలయోద్యమములో 'గ్రంథాలయయాత్ర' అను క్రొత్త వ్యాప్తి సొధన మవలంబించినవారు తెనుఁగువారే. దక్షిణ దేశగ్రంధాలయ సమ్మేళన మహాసభ జరిపినవారు తెనుఁగు వారే. ఇంత ఏల? పొ.గు.కడంకలో తెనుఁగువారు చూపు పట్టువల నేర్పు మొ.సుగుణములు పెఱవారే వేనోళ్ళ పొగడినారు. అట్టిచో ఎవరో తెనుఁగునాట గ్రంథాలయోద్యమము సన్నగిల్లు చున్నదనియు, ఉన్న పొ.గుడులును క్షీణించుచున్నవనియు వ్రాసినవ్రాఁత మనము లెక్కింపనక్కఱలేదు; దానికి కినియనక్కఱలేదు. వేఁడినీళ్ళు పోసినంతటనే ఇండ్లు కాలిపోవునా? పెంపొందుచున్న గ్రంధాలయములు ఒకరు క్షీణించుచున్ననన్న క్షీణించిపోవునా? కాన, మనవారికి పైవారి వ్రాఁత వలన కలిగిన కోపమును పట్టుదలగా మార్చి, పనివేసి, పోయినది మరల నెలకొల్పి, ఉన్నవి మఱింత పెంపొందఁజేసి, క్రొత్తవి ఏర్పాటుచేసి, ఏలోటును కానరాని తెఱంగున మన పొ.గు.కడంక మేలు బంతిగా చేయనగు. అపుడు మన కడంకకు కీడెంచినవారు తమతప్పు తామే దిద్దుకొందురు; అటు చేయనిచో పైవారే వారిని దిద్దుకొనునట్లు చేయుదురు. మన లోటైన్నువారు తమ నాట పనిచేసి, మనతో పోటీలో నెగ్గి, అప్పుడు మన కడంకను నిరసించెదరుగాక ! నెరసులెన్నుట అలంతులపని; పని చేసి-మెప్పొందుట, వలంతులపని.
మన పొ.గు.కడంక, నగరములలోను పట్టణములలోను పల్లెలలోను సాగుచున్నది. అందు మొదటి రెండింటిలో మొత్తముమీఁద మనయిప్పటి దేశపరిస్థితులనుబట్టి పని ఒక విధముగా బాగుగనే జరుగు చున్నదనవచ్చును. ఇక పల్లెలలో అన్ననో కొన్నిటిలో పని బాగుగనే జరుగుచున్నది. కాని, మొత్తముమీఁద చూచినచో, నగరముల గూర్చియు-పట్టణములను గూర్చియు చెప్పినట్లు చెప్ప వీలు లేకున్నది. కుముదవల్లి మొదలగు కొన్ని పల్లెలలో, కొన్ని పట్టణములలో కంటే పని బాగనిపింపవచ్చును. అయినను, పొ.గు.పనిలో మనకు గీటురాయి పల్లెలలోనిపనియే. కాన, మనము దానికే పెద్దఱిక మాయనగు. ఏ ఉద్యమముగాని ఫలవంతమగుటకు అంగబలమును, అర్థబలమును, కావలె. మన దేశమివుడు బీదదగుటచే అర్థబలము చాలకున్నది. ఇఁక, మందికి లోటులేకున్నను-అంగబలమును చాలకున్నది. ఏమందురా? మనలో చదువుకొనిన వారు చాల తక్కువ; విద్యావిధానమందలి లోపముచే ఉన్నవారికిని తగిన శిక్షణములేదు. శిక్షణమునకు లోఁబడు తలంపుగలవారెవరేని ఉందులేని, అట్టివారికి బీదరిక మడ్డువచ్చును. ఆ అడ్డులేక పాటుపడుటకు పూనుకొనువారు కడుసరిది. ఇందువలన, తగిన పొ.గు. కొలువరులు వలయువంతమంది దొరకకున్నారు. డబ్బుసాయమును, త్యాగమును, సమర్ధతయు గ్రంథాలయోద్యమమునకు అవశ్యకములు. కాన ఇవి లభించుటకు వలయు వెరవులు చూడనగు. గ్రంధా