- ౧౯౦౦ యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్, గుఁటూరు
- ౧౯౦౦ వీరేశలింగ పుస్తక భాండాగారము, రాజమహేంద్రవరము, ఇది మధురకవి శ్రీనాళము కృష్ణారావుగారు స్థాపించిరి
- ౧౯౦౦ సుబ్బారాయ గ్రంథాగారము, సిద్ధాంతము, పశ్చిమగోదావరిజిల్లా
- ౧౯౦౧ శ్రీ విక్టోరియా పురమందిరము & సోషల్ క్లబ్బు లైబ్రరీ, నూజివీడు, కృష్ణాజిల్లా
- ౧౯౦౧ శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయము, హైదరాబాదు.
- ౧౯౦౩ శ్రీశారదాపుస్తక భాండాగారము, నాగిరెడ్డిపల్లె, అనంతపురము జిల్లా.
- ౧౯౦౩ కి స్టూడెంట్స్ సెల్ఫ్ ఇంప్రూవింగ్ సోసైటీ గ్రంధాలయము, బెజవాడ
- ౧౯ం౪ హిందూయువజనసమాజ గ్రంధాలయము, ఏలూరు
- ౧౯ం౪ రాజరాజనరేంద్ర భాషానిలయము, హనుమకొండ
- ౧౯ం౪ విద్యార్ధి సంఘ గ్రంధాలయము, నెల్లూరు
- ౧౯ం౪ ఆర్యబాల సమాజగ్రంధాలయము, పెదపాలెము, తెనాలి తాలూకా
- ౧౯ం౪ ఆంధ్రభాషాభివర్ధనీ పుస్తక పత్రికా పఠనశాల, సికిందరాబాదు
- ౧౯ం౪ మిత్రమండలి గ్రంధాలయము, బల్లారి
గ్రంధాలయోద్యమము బయలుదేరిన తొలి యిరువది ఏండ్లలో పైగ్రంధాలయము లేర్పడినట్లు తెలియవచ్చుచున్నది. మఱియేవేని ఉన్నచో తెలిసినవారు తెలుపుదురుగాక !
పై గ్రంధాలయములలో విశాఖపట్టణమున ఏర్పడిన శ్రీ సరస్వతీనిలయమే మొట్టమొదటి గ్రంధాలయమని తేటతెల్లమేకదా! కాన, 'గ్రంథాలయ పితామహ' బిరుదము, అది స్థాపించి - స్వయముగా ఇరువదియేండ్లు నడపిన కీ॥శే॥ మంతిన ఆదినారాయణమూర్తి పంతులు గారికే రావలయు నిర్వివాదాంశమే.
ఇక్కడ మన కృష్ణారావుగా రున్నారు; వారేమైన తెలుపవలసియున్న తెలిపెదరుగాక!
కృష్ణా:-వావిలాల వాసుదేవశాస్త్రి గారోక గ్రంథాలయము పెట్టిరి; అది ముందేమో!
అధ్య:- అది మంది గ్రంథాలయమా?
కృష్ణా:-కాదు.
అధ్యః_ఇఁక సందేహమక్కరలేదు; స్థిరపడినది; విశాఖపట్టణమున ఏర్పడిన శ్రీసరస్వతీనిలయమే మొదటి మంది గ్రంధాలయము.
పైని తెలిపిన దానిని బట్టి
౧౯౦౫ చివరకు తెనుఁగునాట మంది గ్రంథాలయములు ౧౯ లెక్కకువచ్చె; అవి ౧౯౧3 లో ౧౨3, ౧౯౨౦ లో ౬౦౦ అయ్యె. ౧౯౧౩ లో ౧౨౩, ౧౯౨౦ లో ౬౦౦ అయ్యె. ౧౯౩౯ లో ఆం.దే. గ్రం. సంఘము వారు ప్రకటించిన ఆంధ్రదేశగ్రంధాలయముల పట్టికలో ౭౭౯ చేరే. ౧౯౪౦ లో నా లెక్కను బట్టి ౮౪౦ అయి, ౮౪౦ అయి, ౧౯౪౧ మొదట ౯౦౪ అయినవి. ఇంకను చేరవలసినవి కొన్ని ఉండకపోవు. మొత్తముమీఁద ఉజ్జాయింపుగా ౧౮౮౬ మొదలుకొని ఇప్పటికి ఏర్పడిన పొ.గుడులు సుమారు ౧౦౦౦ ఉండును. కాని, ఎన్ని ఇప్పుడు సరిగా పనిచేయుచున్నవో చెప్పఁజాలము.
మన మంది పొత్తపుగుడులు బ్రిటిషు వారి క్రిందనున్న తెనుఁగు జిల్లాలలోను, చెన్న రాష్ట్రమునకు రాజధాని అగు చెన్నపురిలోను, నైజాము క్రిందనున్న తెలుఁగుజిల్లాలలోను, తమిళనాటను మైసూరు సంస్థానమునను, తక్కిన నాడులలోను తెనుఁగువారున్న చోట్లను ఏర్పడినవి. కొన్ని పోయిన పోవుఁ గాక ! కొన్ని సరిగా పనిచేయకున్న చేయక పోవుఁ గాక ! అంతమాత్రమున తెనుఁగునాట గ్రంథాలయోద్యమము క్షీణదశలో నున్నదని మన తమిళ తోఁబుట్టువు లెవరో వ్రాయుటకు కారణము మతి