యుండును. అవి అన్నియు సరిగా పడమటితీరున మంది పొత్తపుగుడులు కాకున్నను కొన్ని యెని కొంత వఱకేని మంది పొ. గుడులనఁ దగియుండును.
తెనుఁగునాటి పొ.గు. మనుగడ - ఇప్పటిది
ఇంక, పడమటితీరున సరిగా ఎట్లు మన పొ. గు. కడంక మొదలై - పొగుచున్నదో తెలిసికొననగు. మనవారు కొందఱు ఇది ఆంధ్రోద్యమముతో ఆరంభ మైనదనుకొను చున్నారు. వారితలంపు తప్పు. గ్రంథాలయోద్యమము పాశ్చాత్యపద్ధతిని ౧౮౮౬ లో ప్రారంభమయ్యే; ఆంధ్రోద్యమము ౧౯౧౩ లో కీ.శే. జొన్నవిత్తుల గురునాధముగారు మొదలగువారి ప్రయత్నమన పైకివచ్చె, అప్పటికే తెనుఁగు నాట పెక్కుమంది గ్రంధాలయము లేర్పడినవి. ౧౯౧౨ లో అవి ౮౫; ౧౯౧౩ లో ౧౨3 లెక్కకు వచ్చే. నిజమునకు గ్రంధాలయోద్యమము వేఱు; ఆంధ్రోద్యమము జేఱు; దాని సభలు వేఱు; దీని సభలు వేఱు. ఆంధ్రమహాసభలు జరుగకున్నను గ్రంధాలయమహాసభలు జరుగుచున్నవి. రెండును ఎప్పుడేని ఒక్క చోట కలిసిన కలయుఁగాక! నిజమునకు బరోడాలోని పొ.గు. కడంకవలెనే ఆంధ్రోద్యమము తన తొలిదినములలో గ్రంథాలయోద్యమమునకు ప్రోత్సాహము కలిగించుటకు తోడ్పడినది.
మన యిప్పటి పొ, గు. మనుగడను గూర్చి యీనడుమనే విశాఖ పత్రికలో కొంత తెలిపియుంటిని. అది యిందు పొందుపఱిచి తక్కిసదియు తెలిపెద.
ఆంధ్రదేశమందలి మొదటి మంది గ్రంథాలయములు
ఆంధ్ర దేశమందలి గ్రంథాలయోద్యమము, వ్యక్తిప్రధానము - సంఘప్రధానము, అని రెండు విధములుగా విభజింపనగు. మంది గ్రంథాలయము లనఁగా ప్రజలందఱ కొఱకును ఏర్పడిన గ్రంథాలయములు. వాని చరిత్రనుబట్టి ఈఉద్యమము సుమారు అఱువదియేండ్ల క్రిందట బయలుదేఱినట్లు తెలియవచ్చును; ఏఁబదియై బేండ్లనుండి వ్రాఁత సాక్ష్యమున్నది. గ్రంధాలయముల బోగట్టా. ఆంధ్రదేశ గ్రంధాలయచరిత్రలోను, పెక్కుర ఉపన్యాసములలోను, గ్రంధాలయ సర్వస్వసంచికలలోను, ఇండియ౯ లైబ్రరీ జర్నల్ సంచికలలోను, తక్కినవానిలోను కానవచ్చును. అయినను, ఇంకను పెద్ద గ్రంధాలయములతో సంబంధమున్న వారుకూడ పొరపడుచున్నారు. కానీ గ్రంధాలయ చరిత్రాభిమానులకు సరి అయిన బోగట్టా తెలుపుట ఆవశ్యకమగుచున్నది. మొదటివానిలో 'మాది మొదటిది', మాది 'మొదటిది'. అని పొరబడకుండుటకు కాలమునుబట్టి మొదటి గ్రంథాలయము లేవేవో వరుసగా క్రింద పొందుపఱిచెద.
- ౧౮౮౬ శ్రీ సరస్వతీ నిలయము, విశాఖపట్టణము - కీ.శే. మంతిన-ఆదినారాయణమూర్తి పంతులు గారు స్థాపించి, స్వయముగా ఇనుపదియేండ్లు నడపిరి. ఇది ఇపుడు "ఆనందగజపతి గ్రంథాలయము అను పేర మాధర్మాశ్రమమున ఉన్నది. దీనిని విశాఖపట్టణను జిల్లా కేంద్రగ్రంథాలయముగా చేయుటకు ప్రయత్నము జరుగుచున్నది.
- ౧౮౮౯ శ్రీ సరస్వతీ విలాసమందిరము, పులివిందుల, కడపజిల్లా,
- ౧౮౯౦ సీ.వీ.ఎ౯. లైబ్రరీ అండు రీడింగురుము, వంగఓలు.
- ౧౮౯౫ నౌరోజిక్లబ్బు, ఉఁడి, భీమవరముతాలూకా
- ౧౮౯౭ వీరేశలింగకవి సమాజ గ్రంథాలయము, కుముదవల్లి, భీమవరముతాలూకా
- ౧౮౯౮ ఒక గ్రంథాలయము, రాజమహేంద్రవరము. పేరు పెట్టకయే శ్రీ నాళము కృష్ణారావు గారు స్థాపించినట్లును, ఇదే ౧౯౦౦ లో వీరేశలింగ పుస్తక భాండాగారమునకును, ౧౯౧౫ లో సర్వజన పుస్తక భాండాగారమునకును, ౧౯౧౯ లో గౌతమీ గ్రంథలయమునకును పుట్టకీటయినట్లును కానవచ్చును.
- ౧౮౯౯ రీడింగ్ క్లబ్బు, కొల్లూరు, తెనాలి తాలూకా.