Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలగు దీవులకు వెళ్ళిరనుటకు 'క్లింగ్' నుడియే పెద్ద నిదర్శనము. అప్పుడే 'తెలుఁగు' తెనుఁగు సుడులు వాడుకలో ఉండెననుటకు ఇప్పుడు బర్మాలోవాడు ' తెవైంగ్', తౌస్గుధు' అను నుడులే సాక్ష్యము. ఇందు ౧౯౩౧ జనాభా లెక్కలనుబట్టి మొదటి తెగవారు ౩,౦౫,౨౯౪ గురును, రెఁడవ తెగవారు ౨,౨౭,౭౧౪ గురును కలరు. పెఱనాడులకు వెళ్ళి, రాజ్యములు చేయఁగలుగు స్థితిలో ఉండినపుడు తెనుఁగువారికి పొత్తములును, పొ.గుడులును ఉండియుండవా? కాని, నన్నయ భట్టు కాలమునకు పూర్వముండిన పొత్తములే మనకిప్పుడు దొరకనపుడు, అంతకుముందు సుమారు ౨ వేల యేండ్లక్రిందటి పెట్లుదొరకును? అయినను, చీనావారు పుస్తకప్రియులు కొస వారి ప్రాఁత పా.గుడులలో ఏవేని ఉండు నేమో! కాని, వానికిని ఎన్నో యిక్కట్టులు వచ్చినవి; ఎన్నో పొత్తములు పోయినవి. ఏమైనను, వీలున్నచో వానికోటి కరయనగును.

సూత్ర కారులగు బోధాయనుఁడును - ఆపస్తఁబుఁడ్రును ఆంధ్రులనుచున్నారు. అట్టిచో వారికాలమున పొ. గుడులుండుటా వింత కాదు. ఆంధ్రులు తెనుఁగునాటిని లోఁబఱుచుకొనినపుడు వారితో ప్రాకృతపుస్తకములు వచ్చినవి. ఆపుడు బౌద్ధజైనమతములు తెనుఁగునాట వ్యాపించుటచే పాలిపొత్తములును, అర్ధమాగధీ పుస్తకములును చేరినవి. నాగార్జునుఁడు తనపేర నొప్పు కొండమీఁద నుండి ౨౪ గొప్ప బౌద్ధగ్రంథములు వ్రాసె; దిజ్నాగుఁడను ఆంధ్ర బౌద్ధాచార్యుఁడు ప్రమాణసముచ్చయమను ప్రమాణతర్క 'పుస్తకము కూర్చె. ధాన్యకటకము ఆంధ్రలకు రాజధానిగా ఉండినపును, అచ్చట విశ్వకలాశాల ఉండేడిది; అందు చదువుకొనుటకు చీనా-బర్మా-సింహళము మొ॥ చోట్లనుండి విద్యార్థులు వచ్చుచుండెడివారు. కాన, అక్కడ ఆపుడు పొ.గు. ఉండెనని వేఱే చెప్పనక్కరలేదు. అట్లే బౌద్ధవిహారములయందును, జైనమఠములలోను, ఆంధ్రరాజుల నగరులలోను, పండితులదగ్గఱను పొ, గుడులు ఉ౦డియుండును.

ఆంధ్రుల తరువాత, పల్లవులు-చాళుక్యులు-కాకతీయులు-విద్యానగరరాజులు-రెడ్లు-వెలమలు-క్షత్రియులు మొ. వారందరు రాజ్యము చేసిరి. విద్యానగరరాజ్యము సామ్రాజ్యము నైతమయ్యే. దండయాత్రలలో కొందఱు పొ.గుడలు కాల్చివేసెడివారు. వేగినాఁడను పేరందుచేతసే వచ్చెనందురు. అట్టిచో, తెనుఁగునాటి పొ.గుడు లుండెననుట నిస్సందేహము. వాడి దగ్గఱి నాగై గ్రామమున దొరకిన శాసనమునుబట్టి రాయనారాయణ అను చాళురారాజు సేనానాయకుఁడు మధుసూదనుఁడేర్పఱి చిన వసతికలాశాలలో ౨రు నేనాధ్యాపకులతోను, ౩రు శాస్త్రోపాధ్యాయులతోను, ౬రు పొత్తపు తీర్పరులుండిగాని తెలియవచ్చును.

తెనుఁగువారికి పొ.గు. మీఁద మక్కువ ఎక్కువ అనుటకు ౧౭ శతాబ్దిమొదట తంజూవూరిలో “తెలుఁగు నాయకులేర్పఱిచిన పొ.గుడియే తార్కాణ.

తుదకు బ్రిటిషువారి యేలుబడి వచ్చింది. జమీందారీలు పెక్కులు బయలు దేఱినవి. జమీందారులలో విద్యాప్రియులు పెక్కురు గ్రంధాలయములు పెట్టిరి. పండితులును, భాషాభిమానులును, పొ. గు. లేర్పఱచిరి. సుమారు ౧౮౦౦ ప్రాంతమున విశాఖపట్టణమున శ్రీ పరవస్తువారు పొ.గు.ఒకటి పెట్టిరి; ఆది ఇప్పుడు 'ఆర్ష గ్రంథాలయము' అను పేర వెలయుచున్నది. ౧౮౨౮ కార్తిరలో ఇండియా సర్వేయర్ జనరల్ గా ఉండిన మెకంజీ దొరగారు తయారుచేసిన తూర్పు వ్రాఁతప్రొత్తముల జాబితాను హెచ్.హెచ్, కిట్సన్ దొరగారు వెల్లడించిరి. అంగు, తెనుఁగుపొ త్తములు ౧౫౬ లెక్కకువచ్చే. ౧౮౩౫ లో తెనుఁగుపొత్తములచ్చుపడ మొదలిడె, అప్పటినుండి పొ.గుడులు పెరుఁగఁ దొడంగె. ౧౮౬౮ నవంబరు 3వ తేదీని సంస్కృతపు వ్రాత పొత్తములను గూర్చి ఇండియా దొరతనము వారు చేసిన తీర్మానమును బట్టి చెన్నపురి దొరతనము వారు నియమించగా దక్షిణదేశమున సంచారముచేసి వెల్లడించిన ఆపొత్తముల జాబితాలలో ఆయన చూచిన పొ.గుడులను గూర్చి తెలిపియున్నారు. అందు విశాఖపట్టణముజిల్లాలోనివే ౩౦ లెక్కకు వచ్చె. అట్టిచో తక్కిన తెనుఁగునాట ఎన్నో ఉండి