స్వవిషయం
'ఆంధ్రగ్రంధాలయం' మొదటి సంపుటము ప్రకటన పూర్తియై చాల కాలమైనను రెండవ సంపుటమును ప్రారంభించుట కింతవరకు మా కవకాశము లభించ దయ్యె. యుద్ధ ఫలితముగ పెరిగిన కాగితపు విలువయు, వలసినప్పుడు తగిన కాగితము లభింపమియు, మా ఆర్థికపుటిబ్బందికి తోడు వ్యాసములు వగైరా అనుకున్న వేళకు అందకపోవుటయు దీనికి కారణములు. మొదటి సంపుటమునకు అచ్చుఖర్చులకైన బాకీ తీర్చకనే రెండవసంపుటమును ప్రారంభించవలసి వచ్చుట చే కూడ ముందు లాలోచించుచు కొంతకాలము గడచినది.
తోడి పత్రికలు
ఆంగ్ల పత్రికలమాట యటుంచి తెలుగు పత్రికలైనను తమసోదరిని కొంత ఆద రించియున్న మాకిప్పటికన్న నెక్కుడు ప్రోత్సాహము లభించియుండెడిది. జన సామాన్యముయొక్క బాగుకొరకు ప్రయత్నించు సకలోద్యమములలో మిన్న యగు గ్రంధాలయోద్యమ విషయమై మాకు సాయపడవలసిన పత్రికలవారు మూకీ భావము వహించుటవలన మేమెంతయు నిరుత్సాహపడితిమి. తెలుగుదేశములోని ప్రముఖములగు పత్రికలన్నింటికిని విమర్శ నార్థము మా పత్రికను మొదట పంపి యుంటిమి. ఇందు 'గృహలక్ష్మి', 'విజ్ఞానం', 'ఆర్హపత్రిక' తప్ప తక్కిన యేపత్రిక గాని దీనిని గూర్చి నాలుగుమాటలైన వ్రాసినది లేదు. ఎవరుగాని వ్రాసియున్నను మాకు వానిప్రతుల బంపినది లేదు. కొన్ని పత్రికలలో విమర్శనార్థము చేరిన గ్రంధ ముల పట్టీలో నైనను మా పత్రిక పేరు చేర్చబడలేదు. ఎడతెగని ప్రచారముతప్ప ఆధారము లేని మా ప్రయత్నమున కీకనుండి యైన తోడి పత్రికలు తోడుపడగలవని ఆశించుచున్నాము.
గ్రంథాలయ పత్రికావసరము
ఏ ఉద్యమానికి గాని స్వంత పత్రిక ఒకటి ఉండడం అవసరం. దారి తెన్ను గానక తంటాలుపడు పరిస్థితిలో ఏ ప్రయత్నముగాని ఎక్కువ కాలము సాగుటకు వీలు లేదు. అనేక తావులలో వేఱు వేఱు పరిస్థితులలో ఎన్నో చిక్కుల నెదుర్కొని పని చేయవలసిన పరిస్థితి గ్రంథాలయ సేవకులది. అగుటవలన ఆయా సందర్భముల కనువగు రీతిని తమ కార్యములు నడపుటకు తోడుపడు విధానముల గూర్చి వారు తెలిసికొన వలసిన అవసర మెంతేని గలదు. నేటి గ్రంథాలయ సేవ కులలో పలువురు తమ పనిని క్రమముగ నిర్వహించుటకు తగినంతగ చదువు కొన్న వారు కారు. చదువున్న వారిలో సహితము గ్రంథాలయ నిర్వహణమునకు