వేదము, లీలావతి గణితము, తేజకమను జ్యోతిష్యగ్రంధము,౪ వేల యే౦డ్ల కాశ్మీరచరిత్ర, హరివంశము, నలచరచరిత్ర మొ. పొత్తములు పార్సీలోనికి మార్పించే; కొన్ని క్రొత్తపొత్తములు వ్రాయించె. ఆయన గ్రంధాలయము మలొకచో దొరకని పొత్తములతో ఒప్పుచుండె. దానిలో ఒక భాగము రాణివాసమున స్త్రీలఱకుండినను, హెచ్చుభాగము సభ భవనమున బహిరంగముగానే ఉండెడిదఁట. ఆ పొ.గు. లోని భారతము ఉత్తర జయపురగ్రంధాలయము చేరినదీ. దానిలో చక్కనిబొమ్మలును, వానిపైని ఉల్లిపొరవంటి లేడితోలుకప్పులును కలవఁట. ౧౭ వ శతాబ్ది జహంగీరు పాజహానులును గ్రంథాలయ పోషకరులే- యాసప్ జులెయి — అను పొత్తము వ్రాసిన నూరల్లీకి జహంగీరు ౧,౦౦౦ మొహరీలు కానుక చేసెనఁట! షాజహాను చక్రవర్తి పెద్దకొడుకు దాగా తన ముత్తాత అగు అక్బరువలె విద్యాప్రియుఁడేగాక, కృతికర్త; పెక్కు పొత్తములు వ్రాసె; ఉపనిషత్తులలో కొన్ని భాగములు పార్శి లోనికి తర్జుమాచేసె. అట్టిలో, అతఁడు గ్రంథాలయ ప్రియుఁడగుటలో వింత ఏమున్నది? ఔరంగజేబు గోలకొండ - హైదరాబాదులు జయించి, అందు వ్రాతపొత్తములు ఢిల్లీ గ్రంధాలయమునకు చేర్చి. కాన, ఢిల్లీ గ్రంధాలను మపుడు మిక్కిలి గొప్పదయి ఉండవలె.
అప్పటి ప్రాఁతపొత్తములలో చిత్రకారులు బొమ్మలు చేర్చి, వాని వాడుక హెచ్చించుచుండిరి. ఎన్నో పొత్తపుగుడులలో విడిబొమ్మల పొత్తములుగూడ ఉండెడివి. చక్రవర్తుల పోషణమున ఎంతో పెంపొందిన ఢిల్లీ పొ.గు.మొగల్ సామ్రాజ్యము నాశనముతో నశించెనని తెలియవచ్చినపుడు గ్రంధాలయాభిమానుల డెందములు కుందకుండు టెట్లు? ౧౮వ శతాబ్దిలో ఢిల్లీ పొ.గు లోని పొత్తములు పెక్కులు అయోధ్యనవాబు పొ.గుడికి చేరే. కాని, ౧౮౫౬ లో అయోధ్య ఆంగ్లేయులకు లోఁబడినపుడు, అచ్చటి పొత్తములు చాలవఱకు కలకత్తాకు చేరినవి; కొన్ని లక్నోకు చేరినవి. ౧౮౫౭ లో జరిగిన సిపాయీల తిరుగుబాటులో ఢిల్లీ-లక్నో నగరములు పాడైనవి; అపుడు పొ. గుడులును పాడయ్యెనని వేఱె చెప్ప నేల? లక్నో ముట్టడిలో కిటికీల కడ్డు పెట్టుకొనుటకు పొత్తములు వాడిరి. అది ముగిసిన పిదప అవి సిపాయీలకు వంటకట్టెలుగా పనికివచ్చినవి ? ఏలమువేయఁగా కొన్ని ఏసియాటిక్ ఏస్యాటిక్ సొసైటీవారు కొనినారఁట! అపుడు రామపుర నవాబు అరబ్బీ పార్శి పొత్తములెన్నో కొని, తన పొత్తపుగుడి పెంచెనఁట. ఆ పొ.గు. లోని అరబ్బీ పొత్తములు ౪,౪౬౭; పార్శి పొత్తములు ౪,౨౫౩ బ్యాంకిపుర సంస్థానమందును పోగా మిగిలిన పొత్తములు భద్రపఱచిరఁట.
ఉత్తరదేశమున ఖుదాబక్షను, దక్షిణదేశమున తంజావూరిలో శరభోజీమహారాజును పొ.గు. కడంకలో మిక్కిలి పాటుపడిరి.
నేపాళము, జమ్ము, బికనీరు, ఆళ్వారు, మైసూరు, నైజాము మొ. సంస్థానములవారు గ్రంథాలయములు పెట్టి పోషించిరి. టిప్పుసుల్తారు మంచి పొ. గు. కూర్చె; అందలి పొత్తములుకొన్ని ఇంగ్లాండు చేరే; కొన్ని విల్లీయమ్ కోట కాలేజీకి చేరె.
అల్వారు పొ, గుడికి భానుసింగు మహారాజు ఎన్నో పొత్తములు చేర్చినఁట, పదునైదు దినములకు ఒక పొరటచొప్పున ఆఘామీర్జా వ్రాసిన 'గుల్ స్థా౯' పొత్తము, దీనిలో తలదాఁచు కొనినది. ఎన్నో వన్నెకెక్కిన బొమ్మలుగలవు. దీని అంచులపై నగిషీలు, గులాము ఆలీఖాను-బలదేవు-అను పనివాండ్రు చేసిరఁట! ఇది తయారగుటకు లక్షరూపాయలై యుండునఁట! ఒక ఆల్వారు ప్రభువురు ౩ వేలును, కొసరు మంచి దుస్తుల కానుకయు ఇచ్చి, చక్కని ఖురాను వ్రాఁతపొత్తము కొనెనఁట! మూలము ఊదా నీరాతోను, టీక ఎఱ్ఱ సీరాతోను వ్రాసినారట!
మొగల్ సామ్రాజ్యము రూపుమాసి దేశ మరాజకమైనపుడు, అప్పటికే మన దేశమున చేరి - అధికారమును పలుకుబడియు గడించిన పలు తెగల తెల్లవారు - పోర్చుగీసువారు, ఒలాందులు, డేనులు, ఫ్రెంచివారు, బ్రిటీషువారు తమకు నచ్చిన పొత్తములను ఎట్లో సంగ్రహించి, తమ తమ దేశములకు