గుప్తరాజులు ఉత్తర హిందూస్థానమున క్రీ.వె.౩ంం మొదలు ౬౫౦ వఱకును పాలించిరి. పిదప ఎంతో కాలమునకు వచ్చిన ఎలిజబెత్తురాణి రాజ్యకాలము ఇంగ్లాండునకెట్టిదో, గుప్తరాజ్యకాలము ఇండియా కట్టదని వి౯ సెంట్ స్మిత్తు పొగడినాఁడు. అపుడు చదువు మిక్కిలి హెచ్చి. పొ.గుడులు దానితోడివే. గుప్తరాజులలో విశ్రమాదిత్యుఁడు పేరుపొందిన చక్రవర్తి. అతని సభలోని సమణులు విద్యానిధులఁట! అతఁడు పొ.గుడులు పెట్టి పోషించుట వింతయా? పిదప గుప్త సామ్రాజ్యము చీలిపోయి, చిన్నచిన్న ఱే౦డ్లపాలయ్యె. కాని, వారును పొ.గుడులు పెట్టి, పెట్టించి, వ్రాఁత పొత్తములు పోకుండ కాపాడిరి. ఆవి తాళ-భూర్ణ పత్రములమీఁద ఎంతో ఓపికతో వ్రాసెడి వారు.
౭వ శతాబ్దిని హర్షచక్రవర్తి ఈత్తరదేశమును, చాళుక్యరాజగు రెండవ పులకేసి చక్రవర్తి దక్షిణాపథమును పరిపాలించునపుడు గ్రంధాలయములు ఇండియాలో అంతటను వ్యాపించియుండును.
౧౧న శతాబ్దిని భోజరాజు పండితుఁడగుటచే గ్రంథాలయము స్థాపించె. చాళుక్యులు మాళవదేశమును జయించినపుడు అపొత్తపు గుడిలోని పొత్తములు తీసికొనిపోయిరి.
చాళుక్యులలో విశాలదేవుఁడు పొ.గుడుల కొఱకు సొమ్ము హెచ్చుగా వెచ్చించెనఁట. ఆతని గ్రంధాలయములోని రామాయణము జర్మనిలోని బో౯ విశ్వవిద్యాలయ గ్రంధాలయమునకు చేరిన దందురు.
౧౨వ శతాబ్దిని మహమ్మదుఘోరి ఇండియాపై దండెత్తివచ్చినపుడు ఉత్తరహిందూస్థాన రాజ్యములలో పా.గుడులు హెచ్చుగా ఉండి, మంది తెలివితేటలు గలిగి, వాని నెదిరించి, ఓడించిరి. అదిచూచి, పిదప అతఁడు పొ.గుడు లెన్నో పాడుచేయించెనఁట! అతఁడు త్రొక్కినతోవనే కొందఱు తురుష్క దండయాత్రికులును తొక్కిరి. గ్రంధాలయములు పాడుచేసిరి. బౌద్ధభిక్షుకులు కొన్నిపొత్తములు వారికి చిక్కకుండ నేపాళ దేశమునకు కొనిపోయిరి. కాని, ఏమి లాభము? అవి ఆచ్చటి రాజ మంత్రుల మనోదౌర్బల్యము వలననో, ఆంగేయుల ప్రోద్బల ప్రోత్సాహ నైపుణ్యమువలననో, అక్కడ నుండి తరలిపోయి, లండను నగరము చేరినవి. ఇప్పటి గోరిల్లా గుంటలపోరులలో అవి ఏమయినవో! ఏమి కానున్నవో! ఎవరు చెప్పగలరు?
తురుష్కుల దాడులలో ఉత్తరదేశ గ్రంథములు నేపాళమునకు, టిబెట్టు దేశమునకు చేరినట్టు, మధ్య దేశమందలి గ్రంథములు విద్యానగర సామ్రాజ్యమునకు చేరెనందురు. కాని, ఆసామ్రాజ్యమును తురకల దాడికి లోనయ్యే. అపుడు ఎన్ని పోయినవో! ఎన్ని మిగిలినవో! సరిగ్గా చెప్ప వీలులేదు.
భూటాన్ పట్టణమున బౌద్ధవిహారపుపట్టు త్రవ్వునెడ గ్రంథాలయ మొకటి బయలుపడె. తురుస్కులదాడికి వెఱచి, అది పాతి పెట్టియుందురని డాక్టరు సై౯ గారు వ్రాసిరి. అందు ౭ భాషలలో వ్రాసిన ౪ వేల పొత్తములు కలవు. అది సమగ్ర దేవాలయ గ్రంథాలయమని తేలినదఁట! అనఁగా ఒక్కొక ఒక విషయమును గూర్చి ప్రత్యేకముగా ఒక్కొక గ్రంధాలను మేర్పఱుచుట మంచిదని యిప్పుడు మనమనుకొనుచుండ ఆపద్దతి మన పూర్వులే వాడుకలోనికి తెచ్చినట్లు దీనివలన తేటపడినది.
కొందరు మహమ్మదీయులు పొత్తములు కాల్చివేసి, పొత్తపుగుడులు పెక్కులు పాడుచేసినారు. కాని, కొందఱు పొత్తములను కాపాడి, పొ.గుడులు పెట్టి పోషించినారు. తుగ్లక్ ఫిరోజిషా చక్రవర్తి ౧౪వ శతాబ్దిలో జ్వాలాముఖి దేవాలయమున ౪ వేల పొత్తములున్నట్లు తెలియవచ్చినపుడు, అవి ఢిల్లీకి చేర్చి, అందలి ముఖ్య గ్రంథములను అరబ్బీ - పారసీ భాషలలోనికి తర్జుమాచేయించే. చక్రవర్తులలో హుమయూ౯ ౧౬వ శతాబ్దిని గ్రంధాలయములు స్థాపించి, పోషించెనఁట! అతని కొడుకగు అక్బరుమాట చెప్పనక్కఱయేలేదు. ఆయన (గ్రంధములను చదివించి, వినుచుండెడివాఁడు; ముఖ్యగ్రంథములు రెండు మూఁడు సార్లుకూడ వినెడివాఁడఁట. భారతము, రామాయణము, అధర్వ