Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానితోడిదే. 'నేల ఒక వైపున కడలినుండి లేచునపుడు మరొకవైపున అది కడలిలోనికి పోవును. కాన, అట్లాంటిస్ ఖండము బాగుగా పైకివచ్చునప్పటికీ లెమూరియాఖండము బాగుగా మునిఁగిపోయె. ఇప్పటికి రా-౧౦ లక్షల యేండ్లనడుమ ఈత్తరహిందూస్థానము పైకివచ్చె; మంచుకొండ వచ్చె. అట్లాంటిస్ ఖండము విస్తరించియుండినపుడు ప్రాతయిండియా దానిలో చేరియుండె. ఇప్పటికి సుమారు అ లక్షల యేండ్ల క్రిందట ఉత్తరహిందూస్థానము మంది ఉండుటకు తగిన ఉనికిలోనికివచ్చె. దక్షిణదేశమునుండి సింహళము విడిపోయె.

లేమూరియా ఖండము మునిఁగిపోయినపుడు మిగిలిన తూర్పు దీవులనుండి లెమూరియనులు కొందఱు ఉత్తరహిందూస్థానము చేరి, మంచుకొండల వరుసను వ్యాపించిరి. వారిలో కొందరు ఇప్పటి సంతాలు పర్యణాలపట్టున రాచఱికముచేసిన జాడలు కానవచ్చుచున్నవి. ఈతెకు చెందినవారినే ఆర్యులు నిషాదులనిరి; వీరిని పడమటి నెఱవాదులలో మొదటివారు కొలారియను లనఁగా, ఇప్పటివారు ము౦డాలనుచున్నారు. అట్లాఁటియనులలో రెండవపిల్ల తెగవారగు త్లవసముద్రముమీఁదుగా వచ్చి, దక్షిణదేశమున ప్రవేశించి, అక్కడి లెమూరియనులతో నానాఁటికి కలసిపోయిరి; ఆరెండు తెగలవారిబిడ్డలే తొంటిద్రావిడులు. ఇక, అట్లాఁటియనులలో మూఁడవ పిల్లతెగవారును, త్లవత్లలు కంటేను నాజూకుతనము గడించినవారు నగు తోలెైక్కులు ఇప్పటి ఆఫ్ఘన్ స్థానముమీఁదుగా వచ్చి, ఇండియాలో చొచ్చి, దక్షిణదేశమువఱకును వ్యాపించి, అచ్చటి తోలిద్రావిడులతో కలిసిపోయిరి.

తొలి ద్రావిడులు తమ పుట్టుపట్టగు దక్షిణదేశమున రాజ్యముచేయుచు, పిదప ఉత్తరదేశమంతయు లోబరుచుకుని, అప్పుడు మంచుకొండకు ఉత్తరమున ఉండిన కడలివఱకు ఎలిరి; వారే ఇండియాలో మొట్టమొదటి సామ్రాజ్యము స్థాపించినవారు. హరప్ప, మహేంజోదారో నాగరికతల చేరినదే. సర్ జాన్ మార్షల్ పండితుఁడు రెండవదాని నాగరికత ద్రావిడులదని ఊహించే; అది నిజమే. ఆ మహాసామ్రాజ్యములో నిషాదులరాజ్యములును, తొలైక్కుల రాజ్యములును చేరిపోయె. వారు సుమారు ౫౦ వేల యేండ్లు, ఆర్యులు తమ్ము త్రోసిరాజును చేయువఱకును ఇండియాను ఏలి, తమ నాగరికతయు - తమ భాషయు కన్యాకుమారినుండి కాశ్మీరమువఱకును నెలకొల్పిరి. అందుచేతనే, భరతఖండపు తొలిభాష ద్రావిడభాష అంటిని; అనుచున్నాను; అనఁగలను. సంస్కృతము భరతఖండపు తొలిభాష అనుకొనుట వట్టి భ్రమ; అది ఎల్ల భాషలకును తల్లీ అనుట అతిశయోక్తి; నిజమునకు, సుమారు ౪-౫ వేల యేండ్ల కిందట ఏర్పడిన భాష అధి; అది వేదభాష నుండి పుట్టినది; అదీ సుమారు 20 వేలయేండ్ల క్రిందటివి కావచ్చును. ఇఁక, తొలి ద్రావిడభాష అన్ననో సుమారు రెండులక్షల యేండ్ల క్రిందటనే ఏర్పడి, తమిళము - తెనుఁగు మొదలగు పలుకులుగా విడిపోవునఱకును తన జెండా ఎగురవేయుచుండిన మేటిపలుకు. ప్రాకృతములను పేరను, దేశభాషలను పేర్లను వాడుకగు పలుకులెల్ల దాని బిడ్డలు. అది తొలుత వేదభాషకును, పిదప సంస్కృతమునకును, తోడుగా ఉండె. సంస్కృతము పెంపొందిన పిదప ఉత్తర దేశభావులు దానినుండి పుట్టిననుడులతో నానాఁటికి నిండిపోయినవి; అయినను, వాని యెముకులగూఁడు కన్నతల్లి యిచ్చినదే. పలుకులకు గీటురాయి మాట యేర్పాటు. అది యిండియాలోని అన్ని పలుకులలోను ఒక్క తీరుననే కానవచ్చుచున్నది. కావుననే, నా నెయ్యురు డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు ద్రావిడభాషలను గూర్చి గాలిలో మేడలుకట్టి, తుదకు తమ సిద్దాంతము సత్యము కానిచో, ప్రాకృతముల నెల్ల ద్రావిడభాష లాక్రమించిన వనియు - అవి ద్రావిడభాషలనుండి పుట్టినవనియు సిద్ధాంతము చేయవలసియుండునని వ్రాయవలసివచ్చినది. ప్రాకృతములు ద్రావిడభాషనుండియే పుట్టినవనియు, సంస్కృతము వాని నాక్రమించినదనియు పైని నేను తెలిపినదానినిబట్టి తేట తెల్లమే. రావుగారే నిజము తలకిందు చేయుటకు ఎంతో పాటు పడీ, తెనుఁగు మనుగడ తెఱుమాఱు చేసినారు. ఆంధ్రవిశ్వకలాపరిషత్తువారు ఆట్టి మనుగడను అచ్చు వేయించి, తెనుఁగువారికి మేలుచేయుచున్నామను భ్రమతో డబ్బు దండుగ పెట్టుకొనుటకు తోడు,