ఎవరికి తగినట్లు వారికి జ్ఞానసాధనములు చేకూర్చుట ప్రభుత్వవిధి - అని ఇచ్చటివారి సిద్ధాంతము! పొ.గుడులు మేటియెఱుక వేల్పుగిడ్డులనియు వారి నమ్మకము !! ఇట్టి పొ. గుడులను మందికి పనికివచ్చు తెఱంగున వారిదగ్గఱకు చేర్పవలయుననుటయే ఇచ్చటి గ్రంధాలయోద్యమము పైనాడులకిచ్చు క్రొత్త సందేశము !!!
ఇప్పటికి పడమటినాడులలో పొ.గు. కడంక ఎట్లు నడచుచున్నదో చూచాయగా తెలిసినది. ఇఁక అది తూర్పునాడులలో ఎట్లు సాగుచున్నదో చూడనగు. ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండ ములలోని నాడులు పడమటి నాడులుగా మన మెంచినాము. కాన, తూర్పునాడు లనఁగా ఆసియా-ఆస్ట్రేలియా ఖండములలోనివే. తూర్పు దీవులును వీనితో చేరును.
ఆసియా — ఇందు పెద్దనాడులు సైబీరియా, చీనా, జపాను, ఇండియా, పెర్ష్య, అరేబియా, టర్కీలు. వీనిలో సైబీరియా సోవీట్ రష్యా దొరతనము క్రింద ఉన్నది. కాన, అందలి పొ.గు.కడంక తక్కిన ఆదొరతనము క్రింది నాడులలో ఉన్నట్లే ఉండునని తలంపవచ్చును. టర్కీలోకూడ పడమటి నాడులలో వలెనే జరుగుచుండునని తలంపనగు. చీనాలో ఆమెరికా తీరున పనిచేయుటకు మొదలిడిరి. జపానులో బాగుగానే పని సాగుచున్నది. అరేబియా-పెర్యాలలో పని సరిగా జరుగు చున్నట్లు కానరాదు. తక్కిన చిన్న నాడులలోని ఉనికియు అట్టిదే. ఇండియాలోను మొత్తముమీఁద పని బాగుగా జరుగుటలేదనియే చెప్పవలె. కాన, పడమటినాడులకు ఈ తూర్పునాడులు తీసి కట్టులే. ఇండియాలోను-జపానులోను, పొ.గు.కడంక మొత్తముమీఁద స్వదేశపద్ధతులమీఁదనే జరుగుచున్నది. డచ్చి తూర్పుదీవులలోను, ఫిలిప్పైను దీవులలోనూ, పొ.గు.కడంక బాగుగా జరుగు చుండుటకు కారణము పడమటి వాదులతోడిపొత్తే.
ఆస్ట్రేలియా - ఇది పడమటి దొరతనముక్రింద స్వతంత్రత కలిగియున్నదగుటచే ఇందలి నాడులలో పొ.గు.కడంక కొంతకాలమునుండి బాగుగా జరుగ మొదలిడినది. మంది పొ.గు. మొత్తము ౧౫,౦౦౦ లకు మించియుండును; పొత్తములు ౩౦ లక్షలకంటే హెచ్చుగా ఉన్నవి, మెల్బరోను నగరపు పొ.గు. లో ౨ లక్షల పొత్తములు కలవు; అందు, ౩౦,౦౦౦ తలుపులులేని బీరువాలలో ఉండును, సిడ్నీ, అడివెయిడి మొదలగు నగరములలోను, పట్టణములలోను, పల్లెలలోను, పొ.గుడులు కలవు.
ఇండియా పొ. గు. మనుగడ - ప్రాఁతది
ఇప్పటికి పైనాడుల పొ.గు. మనుగడను గూర్చి మసకు వలయునంత తెలిసికొంటిమి. కాన, ఇఁక ఇండియా పొ.గు. మనుగడను గూర్చియు తెలిసికొననగు.
ఇండియా అనఁగా సేతువునకు హిమవత్పర్వతమునకును నడుమనుండు దేశమని మనుమిపు డనుకొను చున్నాము. దీనినే ఆర్యులు భరతఖండమనిరి. ఇది భరతవర్షములోనిదనియు, అది జంబూద్వీపములోనిదనియు, సంధ్యావందనము చేయువారికి తెలియును. కాని, ఇండియా ఎప్పుడును ఇట్లే ఉండెననుకొనుట పొరపాటు. మొట్టమొదట వింధ్యము ఉత్తరపుటెల్లగా ఉండు దక్షిణదేశము మొదలుకొని బొంబాయిరాష్ట్రమును-సప్తసింధుదేశమును చేరినదే ప్రాఁతయిండియా. ఆపుడు క్రొత్తయిండియాలోని తక్కిన వాటా అంతయు కడలియే; మంచుకొండయు నాఁడు లేదయ్యె. సింహళ మపుడు దక్షిణదేశముతో కలసియుండెడిది. నిజమునకు ప్రాతయిండియా దక్షిణమూరియా ఖండపునడుమ ఉత్తరము గా ఉన్న వాటా. కాన, అది ప్రాఁతయిండియానుండి విడిపోయిన పిదప అక్కడ లెమూరియనులలో ఏడవపిల్ల తెగవారు ఉండేడివారు. వారు ప్రోళ్ళు కట్టిరి; కాన, నాగరకులు. వారిలో భాషయు కొంతవఱకు వెంపొందె. లెమురియాఖండము నానాఁటికి తగ్గిపోవునపుడు వింధ్యపర్వతమునకు ఉత్తరమునను-తూర్పునను ఉండిన కడలినుండి నేలపైకి రాఁదొడఁగె; మంచుకొండయు